కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి
● పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో
నాయకులు పిలుపు
రాయగడ: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అందరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ భవనంలో పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రాయగడ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రక, డీసీసీ సాధారణ కార్యదర్శి శంకర్షణ్ మంగరాజు, సీనియర్ నాయకుడు దుర్గా ప్రసాద్‌పండ, జీవితేశ్వరరావు, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని నాయకులు అన్నా రు. మిగతా పార్టీలు వచి పొతుంటాయని అప్పలస్వామి కడ్రక వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ పిలుపు మేరకు సోమవారం స్థానిక టీపీసీసీఎల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు వెల్లడించారు.. విద్యుత్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో మోసాలు చేస్తున్నందుకు నిరసనగా చేపడుతున్న ఆందోళనలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎంతోమంది అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు, పద్మా పాంగి, సరోజ్ పాత్రో, పి.కేశురావు, రహీమ్ ఖాన్, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని కలిమెల, కోరుకొండ, చిత్రకొండ, ఖోయిర్‌పూట్, బలిమెల, పోడి యా, మాత్తిలి సమితుల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు, నాయకులు పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే (మోహాన) దాశరథి గోమాంగో ముఖ్యఅతిథిగా విచ్చేసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రఘుపతి రాఘవ రాజారాం.. పాటను పాడి జాతీయ కాంగ్రెస్‌పార్టీ 140 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహానీయులు గాంధీ, జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలను స్మరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ అప్పటి జాతీయ పతాకంలో చరక వున్న జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బసంత పండ, ఈశ్వర్ మఝి, మాజీ వైస్ చైర్మన్ (పురపాలక) సంజయ్ అధికారి, సంగ్రాం సాహు, త్రినాథ పాత్రో, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
జయపురంలో..
జయపురం: జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయపురంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జయపురం మున్సిపల్ చైర్మన్, పట్టణ పార్టీ అధ్యక్షులు నరేంద్రకుమార్ మహంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ నాయకత్వం, శాంతియుతంగా ఆయన సాధించిన స్వాతంత్య్రం వివరించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపింది కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. కార్యక్రమంలో జయపురం బ్లాక్ అధ్యక్షులు బసంత నాయిక్, కొరాపుట్ మైనారిటీ వర్గ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు హసన్ మదాని, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు చింటు రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది మదన మోహణ నాయిక్, పట్టణ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి వెంకటరావు పట్నాయక్, రామ నాయిక్, కై లాస్ బిశాయి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి
కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి
కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి


