తైక్వాండో పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

తైక్వాండో పోటీల్లో సత్తా

Dec 29 2025 9:11 AM | Updated on Dec 29 2025 9:11 AM

తైక్వ

తైక్వాండో పోటీల్లో సత్తా

స్వర్ణం, వెండి పతాకాలు కై వసం

పర్లాకిమిడి: భద్రక్‌ జిల్లా బిజూపట్నాయిక్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండ్‌ పోటీల్లో గజపతి జిల్లాకు చెందిన ఆరుగురు క్రీడాకారులు స్వర్ణ, వెండి, కాంస్య పతకాలు సాధించినట్టు గజపతి జిల్లా తైక్వాండ్‌ అకాడమీ అధ్యక్షుడు కార్తీక్‌ చంద్ర మహాపాత్రో తెలియజేశారు. ఈ రాష్ట్ర స్థాయి తైక్వాండ్‌ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 300 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. గజపతి జిల్లా నుంచి కేవలం 8 మంది పోటీల్లో పాల్గొన్నారు. స్వర్ణం, వెండి పతకాలు సాధించిన వారిలో అనుకంప మల్లిక్‌ (స్వర్ణం), భుబనానంద భుయ్యాన్‌ (వెండి), సువర్ణసాహు (స్వర్ణం), పి.సాయిస్మిత (స్వర్ణం), అనుశ్రుత మల్లిక్‌ (స్వర్ణం, వెండి), సాగర్‌ బారిక్‌ కాంస్య పతకం సాధించారు.

తైక్వాండో పోటీల్లో సత్తా 1
1/1

తైక్వాండో పోటీల్లో సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement