దాడి ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి గుముక పంచాయతీ ఎం.వి.64 గ్రామంలో నివసిస్తున్న రవేంద్రమాల్లిక్ (60)పై తన అన్న తపన్ మల్లిక్‌తోపాటు మరికోంత మంది దాడి చేశారు. ఈ ఘటనలో రవేంద్ర తీవ్రంగా గాయపడడంతో కుటుంబసభ్యులు కలిమెల ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తీసుకున్నారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయంగా ఉండడంతో మల్కన్‌గిరి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే రవేంద్ర ఆరోగ్యం మరింత క్షీణించడంతో కోరాపూట్ మెడికల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. రవేంద్ర మల్లిక్, అతని అన్న తపన్ మల్లిక్ మధ్య కొంతకాలంగా భూమి కోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న భాగవతం ప్రవచనానికి రవేంద్ర వెల్లి తిరిగి వస్తున్న సమయంలో మరికొంతమందితో కలిసి తపన్.. రవేంద్ర మల్లిక్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు మల్లిక్ కుటుంబ సభ్యులు కలిమెల పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయగా.. ఐఐసీ ముకుందో మేల్కా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పన పరేష్, నిరంజన్ విధాన్, రంజిత్, జగబందు, నీరద్, సుజిత్, జగదీశ్, వినయ్, సౌమన్, తపస్‌పై కేసు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం రవేంద్ర మల్లిక్ మృతదేహన్ని కూటుంబ సభ్యులకు అప్పగించారు.


