భారతీయ సంస్కృతి సజీవం
● ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్
భువనేశ్వర్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం పూరీ జిల్లా రఘురాజ్‌పూర్ వారసత్వ కళా గ్రామాన్ని సందర్శించారు. స్థానిక కళాకారులు తయారు చేసిన సున్నితమైన పట్టా చిత్రాలు, టస్సర్ వస్త్రాలు, చెక్క కళాకృతులు, ఇతర కళా ఖండాలను ఆయన ప్రత్యక్షంగా తిలకించి వారితో ముచ్చటించారు. ఈ పర్యటనలో ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆర్. ఎస్. గోపాలన్ ఇతర సీనియర్ అధికారులతో పాటు పాల్గొన్నారు. రఘురాజ్‌పూర్ కళాకారులను ప్రశంసిస్తూ వారు పట్టా చిత్ర, ఇతర కళారూపాల ద్వారా శతాబ్దాల నాటి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కథలను సజీవంగా ఉంచారని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు రఘురాజ్‌పూర్‌ను సందర్శించి ప్రత్యేకమైన కళా వారసత్వాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. రఘురాజ్‌పూర్‌లో యువ నృత్యకారులు ప్రదర్శించిన గొట్టిపువొ నృత్యం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. పూరీ జిల్లా తరఫున కలెక్టర్ దివ్య జ్యోతి పరిడా, పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ కుమార్ సింగ్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పట్టా చిత్రాలు మరియు ఇతర చేతివృత్తుల కళాఖండాలతో సత్కరించారు.
భువనేశ్వర్‌కు తిరిగి వస్తున్నప్పుడు ఆయన ధౌళి శాంతి స్థూపాన్ని, సమీపంలోని శిలాశాసనాలను సందర్శించారు. బౌద్ధ సన్యాసుల నుంచి బౌద్ధ సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకున్నారు. శాంతి స్థూపం నుంచి కనిపించే భువనేశ్వర్ నగరం, దయా నది యొక్క సుందర దృశ్యం అత్యంత అందంగా ఉందని ఆయన వర్ణించారు. శాంతి, సామరస్యానికి భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. ధౌళి శాంతి స్థూపం నుంచి శాంతి సందేశం ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. మధ్యాహ్నం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉదయగిరి కొండను, దాని పురాతన గుహలను సందర్శించారు. 2,000ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇంత అందంగా చెక్కిన గుహలను, క్లిష్టమైన రాతి పనులను సృష్టించడం గర్వకారణంగా పేర్కొన్నారు. వేల సంవత్సరాల గొప్ప సంప్రదాయాలు మరియు సంస్కృతి నేటికీ ఉదయగిరి కొండపై సజీవంగా ఉండటం చూడటం మరింత సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. తర్వాత ఆయన ముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించారు, అక్కడ పురాతన కళింగ శైలి వాస్తుశిల్పం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. తన కుటుంబంతో కలిసి దేవతల ఆశీస్సులు పొందారు.
భారతీయ సంస్కృతి సజీవం
భారతీయ సంస్కృతి సజీవం
భారతీయ సంస్కృతి సజీవం
భారతీయ సంస్కృతి సజీవం


