
ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్
కొరాపుట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనే డిమాండ్‌ను అవిభక్త కొరాపుట్ జిల్లాలో పేద, బలహీన, బడుగు, గిరిజనులు తేరపైకి తీసుకువచ్చారు. ఆదివారం జయపూర్ సంధ్యా పంక్షన్ హాల్‌లో దళిత, మైనారిటీ సంఘాల ప్రతినిధులు ఐక్య వేదిక ప్రత్యేక సదస్సు నిర్వహించింది. నబరంగ్‌పూర్‌కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు లలిత్ మెహన్ నాయక్ మాట్లాడుతూ కొరాపుట్, నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి, రాయగడ జిల్లాలోని గిరిజనులకు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు ఇచ్చిందన్నారు. వారు షెడ్యుల్డ్ ప్రాంతంలో ఉన్నట్లు రాజ్యంగం గుర్తించిందన్నారు. ఉపాధి అవకాశాలు మాత్రం అందడం లేదన్నారు. ఈ ప్రాంతంలోని వనరులను తీసుకుంటూ, పరిశ్రమలు నడుపుతూ ఉపాధి మాత్రం స్థానికేతరులకు ఇస్తున్నారని ఆరోపించారు. దండకారణ్య లిబరేషన్ ఆర్గనేజేషన్ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు మనస్వని టక్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. పాలకులు ఇక్కడి వెనుకబడిన తరగతుల ప్రజలను ఆదుకోలేదన్నారు. తాము నెల రోజులలో అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన వేలాది మందితో ప్రత్యేక కొరాపుట్ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో దళిత, వెనక బడిన, మహిళా, సీనియర్ సిటిజన్లు, తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.