
అసాధారణమైన అడ్డంకులును అవలీలగా జయించి విజయ ఢంకా మోగించి స్ఫూర్తిగా నిలుస్తారు కొందరు. అదికూడా యంగ్ ఏజ్‌లో కాకుండా వృద్ధాప్యంలో సాధించడం అంటే మాటలు కాదు. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాలనుకున్న వారికే ఇదంతా సాధ్యం అని చెప్పొచ్చు. అలాంటి కోవకు చెందింది ఈ అమ్మమ్మ. ఈ అమ్మమ్మ అందుకున్న గెలుపు వింటే..సూపర్ బామ్మ అని అనుకుండా ఉండలేరు. ఆ ఏజ్‌లో చదవాలనుకోవడమే గొప్ప..కానీ ఈ బామ్మ తనున్న వైకల్యానికి చదవాలనే నిర్ణయమే అత్యంత సవాలు. పైగా అందరి అంచనాలను తలకిందులు చేసేలా విజయం అందుకోవడం మరింత విశేషం. ఆ అమ్మమ్మ ఎవరు ఏంటా కథ సవివరంగా తెలుసుకుందామా..!.
అమెరికాలోని టేనస్స్ రాష్ట్రానికి చెందిన 47 ఏళ్ల అమండా జుయెట్టెన్‌కి ఉన్నత విద్యపూర్తి అయిన వెంటనే వివాహం అయిపోయింది. ఆ తర్వాత పిల్లల బాధ్యతలు, కుటుబ పోషణార్థం ఉద్యోగం చేయడం తదితరాలతో జీవితం గడిచిపోయింది. అమ్మమ్మగా మారే నాటికి రెటినిటిస్ పిగ్మెంటోసా అనే పరిస్థితి కారణంగా కనుచూపు పోగొట్టుకుంది. కనీసం ఈ చరమాంకంలో అయినా ..ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామనుకుంటే..కంటి చూపే కరువైపోయింది అని విలవిలలాడింది.
కనీకనబడకుండా ఉన్న ఆ కొద్దిపాటి కంటి చూపుతోనే ఏదైనా నేర్చుకోవాలని ఆరాటపడింది. ఆ క్రమంలోనే కొలరాడో సెంటర్ ఫర్ ది బ్లైండ్‌లో ఎనిమిది నెలల గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అయ్యింది. 30 ఏళ్లక్రితం వదిలేసిన చదువుని తిరిగి బుర్రకు ఎక్కించుకోవడం..పట్టు సాధించడం తదితరాలను తన ఆత్మవిశ్వాసంతో ఎందుర్కొంది.
తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్నా ఆమె ప్రగాఢమైన కోరిక ఆ గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి అయ్యేలా చేసింది. తన సంరక్షకుడు, గైడ్ అయిన తన పెంపుడు కుక్కతో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకుంది. తాను అందురాలిగా ఆ స్కిల్ నేర్చుకోకుండా మిగిలిపోకూడదనుకున్నా అని సగర్వంగా చెబుతోంది.
అంతేగాదు అంధులకు స్వరం కావాలి. అందుకోసం మంచి ఉన్నత చదువులు చదవాలి..అప్పుడే వారు తమ గళాన్ని వినిపించగలరు అంటుందామె. వారిలో స్ఫూర్తి నింపేందుకే తన ఎడ్యుకేషన్ జర్నీని ఆపనంటోంది. డాక్టరేట్ కూడా సాధించాలనుకుంటోంది. మరీ ఆ అమ్మమ్మకి ఆల్ ద బెస్ట్ చెప్పి..విజయం సాధించాలని మనసారా కోరుకుందాం..!.
(చదవండి: భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు )