
భారతదేశంలోని పలు ప్రదేశాలు..వాతావరణం తదితరాలను ఎందరో విదేశీయలు మెచ్చుకున్నారు. ఇక్కడ సాంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చాయని ఇక్కడే నా పిల్లలను పెంచుతానని ఒక విదేశీ తల్లి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇవన్నీ మరువక ముందే ఇప్పుడు మరో విదేశీ జంట ఇక్కడ వంటకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతీయులు వంటకాలు వండే పద్ధతి గురించి ఏం చెబుతున్నారో ఆ జంట మాటల్లోనే విందామా..
భారతీయు రోజువారీ వంటల్లో ఆకుపచ్చని పదార్థాలను విరివిగా వినియోగిస్తారని అన్నారు. ఇక్కడ పచ్చిగా ఉన్నవాటిని చక్కగా పచ్చళ్లు పట్టేస్తారు లేదా ఘుమ ఘుమలాడే కూరల్లా మార్చేస్తారు. అదే పండిన వాటిని పండ్లు మాదిరిగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. పండని కూరగాయలు, పండ్లతో చేసే వంటకాలని అసాధారణ ఆవిష్కరణలుగా అభివర్ణించారు.
ముఖ్యంగా ఆకుపచ్చని మామిడిపండ్లతో పట్టే ఊరగాయ, పనపండుతో చేసే వంటకాలు అమోఘం అని ప్రశంసించారు. భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు. వాళ్ల చేతిమహిమతో అద్భుతమైన రుచిగా మార్చేస్తారు. పువ్వులను పకోడాలుగా మార్చేయడంలో వారి పాక నైపుణ్యం ఊహకందనిదని అన్నారు.
పచ్చిగా ఉండే సబ్జీలో ఉడికించి తినడం మరింత అద్భుతమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి 'భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు..భారతీయులుగా మేము చాలా వాటిని పచ్చిగా తింటున్నామనే విషయాన్ని గమనించలేదు. అయినా మా ఆహార సంస్కృతి ప్రాంతాల వారీగా మారుతుందని అది కూడా తెలుసుకోండి అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే.. )