
విలాసవంతంమైన ఆహారపదార్థాలను ఎన్నో చూశాం. కానీ ఐస్‌క్రీం డిజర్ట్‌లలో గోల్డ్‌తో చేసింది చూసుండరు. దీన్ని విక్రయించే వ్యక్తి సైతం గోల్డ్ మ్యాన్‌లా మెరిసిపోతుండటం విశేషం. ఇంతకీ ఎక్కడ ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నారంటే..
ఇండోర్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతన సరఫా బజార్‌లో ఈ 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ దొరకుతుంది. అక్కడ ఈ విలాసవంతమైన డెజర్ట్ తోపాటు ఫలూడా, ది గోల్డ్ మ్యాన్ జామున్, రబ్డీ వంటి వివిధ రుచులను సైతం అందిస్తోంది. ఇక్కడ ప్రత్యేకతే ఏంటంటే..ఈ గోల్డ్ కుల్ఫీని అందించే వ్యక్తి ఒంటి నిండా గోల్డ్‌తో ధగ ధగ మెరిసిపోతూ కనిపిస్తుంటాడు.
బహుశా అదే అతడి సేల్స్ ట్రిక్ ఏమో గానీ..చూడటానికి మాత్రం ఏదో లగ్జరీయస్ హోటల్‌కి వచ్చామా..! అనే డౌటు వచ్చేస్తుందని అంటున్నారు అక్కడ స్థానికులు. అత్యంత ఆడంబరంగా కనపించే వీధి దుకాణమే ఇది. ఒరిజనల్ గోల్డ్‌తో తయారయ్య ఈ కుల్ఫీ ధర వచ్చేసి రూ. ₹351-401ల మధ్య ఉంటుందట.
ఇది శతాబ్దాల నాటి పాక సంప్రదాయానికి పరాకాష్ట. ఇండోర్ సందర్శించడానికి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఈ కుల్ఫీని తిని చూడకుండా వెళ్లరట.
'సరఫా' అనే పేరు ఎలా వచ్చిందంటే..
హోల్కర్ రాజవంశం సమయంలో 18వ శతాబ్దం నాటి ఈ మార్కెట్ బంగారం, వెండి వ్యాపారుల వాణిజ్య కేంద్రంగా ఉండేదట. అందుకే దీనికి "సరఫా" అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక హిందీలో దీని అర్థం బులియన్. కానీ చీకటి పడుతుందనగా.. ఈ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాలు మూతపడిపోతాయి..
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..అత్యంత ఫేమస్ అయిన ఈ గోల్డ్ కుల్ఫీ దుకాణం అమ్మకాలు ప్రారంభమవుతాయట. చిరుతిండికి ఫేమస్ ఈ బజార్. ఈ కుల్ఫీ దుకాణమే కాకుండా రుచికరమైన జిలేబీలు, స్పైసీ దాల్ బఫ్లా వంటి చిరుతిండ్లకు చిరునామా ఇది. భద్రత దృష్ట్యా మొదలైన ఈ మార్కెట్ క్రమంగా విస్తరించిందట.
చివరగా ఈ సరఫా బజార్‌లో ది గోల్డ్‌మ్యాన్ విక్రేత అందించే బంగారు కుల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా హైలెట్‌గా నిలిచిన డెజర్ట్. ఇది ఒక రకంగా రుచితోపాటు..సర్వ్ చేసే వ్యక్తి దృశ్యం.. కస్టమర్‌ని ప్రభావితం చేసేలా అమ్మకాలు జోరందుకుంటాయనే విషయాన్ని హైలెట్ చేసింది.
(చదవండి: టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్‌కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!)