
సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణ అధికారులు నిర్దారించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి గల కారణాల్ని వెల్లడించారు. అధికారుల తెలిపిన వివరాల మేరకు.. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి కారణంగా ఏసీ కంప్రెషర్లే. ఏసీ కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో దట్టంగా పొగకమ్ముకుంది.
ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లో దట్టంగా పొగకమ్ముకోవడంతో కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మెట్ల మార్గం వైపు రావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ప్రాణభయంతో లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు’ అని చెప్పారు. కాగా, గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.