బీజేపీ పటిష్టతకు కృషి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ పటిష్టతకు కృషి

May 20 2025 1:00 AM | Updated on May 20 2025 1:00 AM

బీజేపీ పటిష్టతకు కృషి

బీజేపీ పటిష్టతకు కృషి

రాయగడ: జిల్లాలో బీజేపీ పటిష్టతకు నాయకులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు సమితి స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలొ కళ్యాణసింగుపూర్‌ సమితి బుడాగుడ పంచాయతీలోని కుంభారిగుడలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు కాలీరాం మాఝి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని అన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేడీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. కళ్యాణ సింగుపూర్‌ మండల శాఖ అధ్యక్షుడు అజిత్‌ పాణిగ్రహి, సహదేవ్‌ జాని తదితరులు పాల్గొన్నారు.

కొరాపుట్‌ మున్సిపల్‌

కార్యాలయానికి తాళాలు

కొరాపుట్‌: కొరాపుట్‌ మున్సిపల్‌ కార్యాలయానికి కౌన్సిలర్లు స్వయంగా తాళాలు వేశారు. సోమవారం కార్యాలయ పని వేళల్లో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు అందరూ చేరుకుని ప్రధాన మార్గానికి తాళాలు వేశారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన మున్సిపల్‌ కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఇలాటి ముఖ్యమైన పోస్టును ఇన్‌చార్జిలతో ప్రభుత్వం నడిపిస్తోంది. దీని వల్ల పనులు ముందుకు సాగడం లేదు. దీనిపై పలుమార్లు కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. చివరకు కౌన్సిలర్లు స్వయంగా తాళాలు వేసి నిరసనకి దిగారు.

ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ బోర్డు ఏర్పాటు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ కోసం ప్రతిపాదించి ప్రవేశ పెట్టిన పథకాల అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారత విభాగం మంత్రి అధ్యక్షతన 12 మంది సభ్యులతో ఈ బోర్డు కార్యకలాపాలు కొనసాగిస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల పునరావాసం, సంక్షేమం కోసం సమగ్ర మార్గదర్శకాల రూపకల్ప న, ఉత్తమ ప్రయోజనాల పరిరక్షణ ఈ బోర్డు ప్రధాన కార్యాచరణగా దివ్యాంగుల సామాజిక భద్రత, సాధికారత శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్ర ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ బోర్డు సభ్యులు

దివ్యాంగుల సామాజిక భద్రత, సాధికారత విభాగం మంత్రి అధ్యక్షుడు, విభాగం కార్యదర్శి ఉపాధ్యక్షుడు, డైరెక్టర్‌ మెంబరు కార్యదర్శి, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, పంచాయతీ రాజ్‌–తాగు నీరు, గృహ నిర్మాణం–పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి–సాంకేతిక విద్య, ఉన్నత విద్య, పాఠశాలలు–సామూహిక విద్య శాఖల నుంచి ఒక్కో ప్రతినిఽధి, జిల్లా కలెక్టర్ల వర్గం నుంచి ముగ్గురు, రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌జెండర్‌ వర్గం నుంచి ఇద్దరు, సంఘ సంస్కర్తల వర్గం నుంచి 2 మంది చొప్పున ప్రతినిధులు బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తారు. త్రైవార్షిక ప్రాతిపదికన రాష్ట్ర ట్రాన్స్‌జెండర్‌ (టీజీ) సంక్షేమ బోర్డు పని చేస్తుంది.

టీజీ అభ్యర్థుల కనీస అర్హతలు

● జిల్లా స్థాయిలో నమోదు ఆధారిత గుర్తింపు కార్డు పొంది ఉండాలి.

● వయసు 25 సంవత్సరాలు పైబడాలి.

● గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత.

● టీజీ వర్గంతో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

తాగునీటి సమస్యపై వినతి

జయపురం: తాము తాగునీటికి కటకటలాడుతున్నామని తమ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి కాఠపొడ గ్రామ పంచాయతీ గదబగుడ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. బొయిపరిగుడ బీడీఓ కార్యాలయానికి వచ్చి మెమోరాండం సమర్పించారు. బీడీఓ లేక పోవటంతో అదనపు బీడీఓ నివేదిత దండసేనకు అందజేశారు. 200 కుటుంబాలకు రెండే బావులు ఉన్నాయని, అందులోనూ ఒకటి పాడైపోయిందని తెలిపారు. వేసవిలో తాగునీటి వసతి కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement