
అగ్నిగంగమ్మకు ప్రత్యేక పూజలు
రాయగడ: స్థానిక పిట్టలవీధిలోని అగ్నిగంగమ్మ అమ్మవారి వార్షిక పండుగలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని మంగళవారం పసుపుతో అలంకరించారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లనితల్లిగా గుర్తింపు పొందిన అమ్మవారికి ప్రతీ ఏడాది వార్షిక పండుగలో ఈవిధంగా ముస్తాబు చేస్తారు. పట్టు వస్త్రాలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి.
పికప్ వ్యాన్ బోల్తా
● ఇద్దరికి స్వల్పగాయాలు
రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి కర్లకోన కూడలిలో పికప్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలొ వ్యాన్ డ్రైవర్, హెల్పర్‌కు స్వల్పగాయాలు తగిలాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కళ్యాణసింగుపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాయగడ నుంచి పచారి వస్తువుల లోడుతో కళ్యాణసింగుపూర్ వైపు వెళ్తుండగా వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడినట్టు పోలీసులు పేర్కొన్నారు.
నత్తనడక నిర్మాణాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
కొరాపుట్: ¯]l™èl¢-¯]l-yýlMýS °Æ>Ã-×ê-ÌSOò³ ¯]lº-Æý‡…-VŠæ-ç³NÆŠ‡ ½gôæï³ GÐðl$ÃÌôæÅ VúÈ Ôèæ…MýSÆŠ‡ Ð]l$hj B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. V>…«©-¯]l-VýSÆŠæ, C^éaÐ]l† VýS$yýl {ç³fË$ GÐðl$Ã-ÌôæÅ¯]l$ ™èlÐ]l$ {´ë…™é-ÌSMýS$ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… BàÓ-°…-^éÆý‡$. 2023 í³{¿ýæ-Ð]lÇÌZ {´ëÆý‡…-¿ýæ-OÐðl$¯]l ™èlÐ]l$ {´ë…™èl…ÌZ° Æøyýl$z, {Oyðl¯óli 糯]l$Ë$ ¯ólsìæMîS ç³NÆý‡¢-Ð]lÓ-Ìôæ§ýl° GÐðl$Ã-ÌôæÅMýS$ Ý린MýS$Ë$ ^èl*í³…-^éÆý‡$. 糯]l$Ë$ ç³NÇ¢-M>-MýS-´ù-Ð]l-yýl…™ø Ð]lÆ>ÛM>-ÌS…ÌZ ™éÐ]l¬ Cº¾…§ýl$Ë$ ç³yýl$-™èl$-¯é²Ð]l$° Ðé´ùĶæ*Æý‡$. ç³Çíܦ† ç³Ç-Ö-Í…-_¯]l GÐðl$ÃÌôæÅ ¡{Ð]l B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. Ððl…r¯ól Ð]l¬°Þç³ÌŒæ GWjMýS*Å-sìæÐŒæ BïœçÜÆŠæ, C…h±-Æý‡Ï¯]l$ í³Í-í³…-^éÆý‡$. ™èl„ýS׿… °Æ>Ã׿… ç³NÇ¢ ^ólõÜÌê ™èlW¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-ÐéÌS° ీ B§ól-Õ…^éÆý‡$.
శ్మశాన వాటిక ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఐఎంఎస్, టి.స్యూల్ సమీపంలో పురపాలక సంస్థ, ఒడిశా సూక్ష్మ పరిశ్రమల నిగమం సంయుక్తంగా నిర్మించిన ఆదర్శ శ్మశాన వాటికను మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కామి మంగళవారం ప్రారంభించారు. పురపాలక సంస్థ అధ్యక్షుడు మానోజ్ కుమార్ బారిక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి అధికారి నరేశ్ చంద్ర శభరో మాట్లాడుతూ.. శ్మశాన వాటికను రూ. 1.50 కోట్లతో నిర్మించినట్టు పేర్కొన్నారు. ఇక్కడ శివుని విగ్రహం, పార్కు, గోదాం, మంచినీటి కోసం బోరును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఉపాధ్యక్షురాలు కవిత మోహంతి, కార్యనిర్వాహక అధికారి కె.అశోక్ చక్రవర్తి , పురపాలక ప్రతినిధి విజయ్ కుమార్ మహారాణా పాల్గొన్నారు.

అగ్నిగంగమ్మకు ప్రత్యేక పూజలు

అగ్నిగంగమ్మకు ప్రత్యేక పూజలు