
పూరీని విడిచి వెళ్లవద్దు
దర్యాప్తు పూర్తయ్యే వరకు పూరీని విడిచి వెళ్లవద్దని దర్యాప్తు వర్గాలు ప్రియాంకకు ఆదేశాలు జారీ చేశాయి. పూరీ జిల్లా పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ బృందం పని చేస్తుంది. ఒడిశా పోలీసులు హరియాణా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జ్యోతి మల్హోత్రాతో ప్రియాంక పరిచయం, పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సందర్శన కోణంలో విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రియాంకను పూరీ విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. పాకిస్తాన్ గూఢచర్యంకు సంబంధించి బహుముఖ కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు వినిత్ అగర్వాల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల సంప్రదింపులతో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. మరో వైపు హరియాణా పోలీసులతో సంప్రదిస్తున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.