నలుగురిపై గృహ హింస కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

నలుగురిపై గృహ హింస కేసు నమోదు

May 14 2025 1:15 AM | Updated on May 14 2025 1:15 AM

నలుగు

నలుగురిపై గృహ హింస కేసు నమోదు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ముద్దాడ గ్రామానికి చెందిన అనిత ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు మంగళవారం ఆమె భర్త ముత్యాలరావు, ముగ్గురు కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేశారు. భార్యభర్తలు మధ్య ఇటీవల గొడవలు రావడం, భర్త అప్పులు చేయడం, కన్నవారి ఇంటి నుంచి డబ్బులు తీసుకు రావాలని ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో అనితకు వివాహం కాగా, కుమార్తె ఉంది. ప్రస్తుతం కన్నవారు ఇంటి వద్ద దుప్పలవలసలో ఉంటోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

108 అంబులెన్సులో ప్రసవం

మందస: మండలంలోని సింగుపురం గ్రామానికి చెందిన రాయవలస భారతి 108 అంబులెన్స్‌లో పండంటి బిడ్డకు మంగళవారం జన్మినిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భారతి పురిటి నొప్పులతో బాధపడుతుండగా వారి బంధువులు 108కు సమాచారం అందించారు. దీంతో మందస 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్‌ ఎస్‌.రాజేంద్ర ప్రసాద్‌లు గ్రామానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆమెకు సిబ్బంది ప్రసవం చేయడంతో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అనంతరం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

పిడుగుపాటుకు మహిళ మృతి

కొత్తూరు: మండలంలోని దిగువ మల్లెలుగూడకు చెందిన యువతి సవర చిన్నారమ్మ (30) పిడుగుపాటుకు మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీ మంగళవా రం తెలియజేశారు. చిన్నారమ్మ మేకలు కాపుకు వెళ్లగా సోమవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి తమ్ము డు సవర రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.

కారు బోల్తా

రణస్థలం:మండలంలోని విశాఖపట్నం వైపు నుం చి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు పైడిపేట జాతీ య రహదారిపై మంగళవారం బోల్తా పడింది. అయితే కారులో ఉన్నవారికి చిన్న,చిన్న గాయా లు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పడినప్పుడు జాతీయ రహదారిపై నీరు నిలబడిపోవడం వలన కారు బోల్తా పడిందని, తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. దీనిపై జేఆర్‌పురం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

గంజాయితో ఇద్దరు అరెస్టు

జి.సిగడాం: మండలంలోని వాండ్రంగి గ్రామ సమీపంలో ఉన్న రైల్వే వంతెన కింద గంజాయితో ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేశామని రణస్థలం సీఐ అవతారం మంగళవారం తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. వాండ్రంగి గ్రామానికి చెందిన మీసాల జగన్నాథరావు, శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన యారగళ్ల పవన్‌ కుమార్‌లు ద్విచక్రం వాహనం ద్వారా 2 కేజీల 300 గ్రాముల గంజాయి తరలించేందుకు ఉండగా స్థానిక ఎస్‌ఐ వై.మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. అలాగే గంజాయి విక్రయిస్తున్న కరిజాం లచ్చన్న, మీగడ గోపిల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నాని వెల్లడించారు. వీరిని త్వరలోనే అరెస్టు చేసి విచారిస్తామన్నారు.

ప్రకాశం జిల్లాలో బస్సు ప్రమాదం

క్షతగాత్రుల్లో జిల్లాకి చెందిన ముగ్గురు వ్యక్తులు

పోలాకి: ప్రకాశం జిల్లా తిమ్మనాపాలెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. చైన్నె నుంచి వస్తున్న బస్సు ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్రకు చెందిన ఎరువుల డీలర్లను కేపీఆర్‌ కంపెనీ మహాబలిపురంలో ఈనెల 12వ తేదీన జరిగిన బిజినెస్‌ మీటింగ్‌కు మూడు బస్సుల్లో తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా అందులో ఒక బస్సు ప్రమాదానికి గురైంది. కేపీఆర్‌ కంపెనీ శ్రీకాకుళం ప్రతినిధి కృష్ణప్రసాద్‌తో పాటు నరసన్నపేట, సంతకవిటికి చెందిన ఇద్దరు డీలర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు.

ముగిసిన అంత్యక్రియలు

శ్రీకాకుళం రూరల్‌: గురజాడ విద్యాసంస్థల్లో మూడు దశాబ్ధాలుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పులఖండం శ్రీనివాసరావు అంత్యక్రియలు మంగళవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడుతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఒక సాహితీవేత్తను, పరిపాలన దక్షుడిని కోల్పోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వీరితో పాటు విద్యాసంస్థల డైరక్టర్‌ రంగారావు, వి.మహేష్‌, ఐక్యూ ఏసీ మర్తాండ తదితరులు సంతాపం ప్రకటించారు.

నలుగురిపై గృహ హింస కేసు నమోదు 1
1/2

నలుగురిపై గృహ హింస కేసు నమోదు

నలుగురిపై గృహ హింస కేసు నమోదు 2
2/2

నలుగురిపై గృహ హింస కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement