120 లీటర్ల మద్యం స్వాధీనం
● ఇద్దరు అరెస్ట్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి భలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో గల పుష్పాలీ గ్రామంలో నివసిస్తున్న సుదర్శన్ దాస్ అనే యువకుడు లైసెన్స్ లేకుండా విదేశీ మద్యం విక్రయిస్తున్నాడని తెలిసి పోలీసులు ఆదివారం ఉదయం దాడి చేశారు. 50 లీటర్ల విదేశీ మద్యంతో పోలీసులకు పట్టుబడ్డాడు. మురికిగూడ గ్రామానికి చేందిన రాజేంద్ర గౌడ్ అనే యువకుడు లైసెన్స్ లేకుండా 70 లీటర్ల విదేశీ మద్యంతో పట్టుబడ్డాడు. ఇద్దరిపై కోరుకొండ ఏఎస్‌ఐ అజిత్ కుమార్ టాక్రీ కేసు నమోద్ చేశారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు.


