పర్లాకిమిడిలో మతప్రచారం
● అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో సోమవారం గుసాని బ్లాక్ బుసుకుడి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన క్రిస్టియన్లు మత ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. వారు పంచుతున్న కరపత్రాలను తీసుకుని పారవేశారు. దీంతో ఎస్.కె.సి.జి.కళాశాల హాస్టల్ వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాస్టర్, ఇతరులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదుపులోకి తీసుకున్న క్రిస్టియన్లను షరతులతో స్టేషన్‌బెయిల్‌పై పోలీసులు విడిచిపెట్టారు. అన్యమత ప్రచారం చేస్తూ హిందూ సనాతన ధర్మాన్ని తూలనాడుతున్న వారిని అనేకసార్లు హెచ్చరించినా పబ్లిక్‌గా మతప్రచారం చేస్తుండటంతో అడ్డుకున్నట్టు భజరంగ్ దళ్ నాయకులు తెలియజేశారు. కరపత్రాలపై జి.డేవిడ్ కరుణాకర్, తిరుపతి పేర్లు ఉన్నాయి.


