ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా పడాల
శ్రీకాకుళం: లావేరు మండలం బుడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పడాల తమ్మినాయుడును ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల కడపలో జరిగిన 79వ రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికల్లో పడాలను ఎన్నుకున్నారు. దీంతో ఆయనను జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేడాడ ప్రభాకరరావు, గురువు శ్రీనివాసరావులు, సంఘం నాయకులు ఎస్వీ రమణమూర్తి, శ్రీనివాస పట్నాయక్, చింతల రామారావు తదితరులు అభినందించారు.
ఆర్బిటర్‌గా నార్మ్ సాధించిన భీమారావు
టెక్కలి: ఇప్పటివరకు ఫిడే ఆర్బిటార్‌గా వ్యవహరించిన జిల్లాకు చెందిన సనపల భీమారావు విశాఖపట్నంలో ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు 5 దేశాలకు చెందిన 582 మంది క్రీడాకారులు పాల్గొన్న చదరంగం అంతర్జాతీయ ఫిడే రేటింగ్ టోర్నమెంట్‌లో ఆర్బిటార్‌గా వ్యవహరించారు. దీంతో ఆయన ఇంటర్నేషనల్ ఆర్బిటార్ రెండో నార్మ్ సాధించారు. ఈ నార్మ్‌ను అంతర్జాతీయ ఆర్బిటార్ జీవీ కుమార్ చేతులమీదుగా అందుకున్నారు. ఆయన ఇంకో నార్మ్ సాధిస్తే ఇంటర్నేషనల్ ఆర్బిటార్‌గా అవతరించనున్నారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చెస్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నార్మ్ అందుకోవడం జరిగిందన్నారు. మరో గ్రాండ్ మాస్టర్ ఈవెంట్లో రిఫరీగా వ్యవహరిస్తే ఫైనల్ నార్మ్ పూర్తి చేయవచ్చని తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు.
ఎస్పీ గ్రీవెన్సుకు 57 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్సుకు 57 వినతులు ప్రజల నుంచి అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తన చాంబర్‌లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
వీఆర్వోలకు పనిభారం తగ్గించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమకు పనిభారం తగ్గించాలని వీఆర్వోలు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. రాత్రీ పగలు పనిచేసినా తరగడం లేదని, వీటితో పాటు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు. వీఆర్వోలపై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లు అజమాయిసీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వేలో కీలకంగా ఉన్న తాము పొలాల్లో ఉంటే సచివాలయాల్లో ఎలా హాజరు వేయగలమని ప్రశ్నించారు. తమకు హాజరు సడలింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎచ్చెర్ల: జనవరి 4వ తేదీన నిర్వహించనున్న ఛలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో అఖిల భారత మహాసభల ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రదర్శన, అనంతరం ఆర్‌కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గ హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటాయన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్వహించడానికి సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందన్నారు. కార్మక వర్గం సాధించుకున్న కార్మిక హక్కులను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శారద, పుష్ప, లలిత, అమృత, కనకం తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా పడాల
ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా పడాల
ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా పడాల
ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా పడాల


