వినతుల వెల్లువ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి బొండాఘటీ ఆండ్రాహల్ పంచాయతీలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రదాన్ నేతృత్వంలో గ్రీవెన్స్‌ను సోమవారం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 48 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 29 వ్యక్తిగత ఫిర్యాదులు, 19 గ్రామ స్థాయి సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. శిబిరంలో తక్షణమే మూడు ఫిర్యాదులను పరిష్కరించారు. ఈ శిబిరంలో గృహవసతి, వృద్ధాప్య పింఛన్, పాఠశాల మౌలిక వసతులకు సంబంధించిన ఫిర్యాదులను విచారణ జరిగింది. వివిధ ప్రభుత్వ పథకాల సేవలను ప్రజలకు చేరువచేయడానికి జిల్లా పరిపాలన ప్రత్యేక క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో కార్మిక కార్డు, రెషన్ కార్డు, అటవీ భూమి పట్టా, ఆధార్ అప్‌డేట్, రైతు నమోదు వంటి సేవలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ శభరో, చిత్రకొండ ఎస్‌డీపీఓ ప్రదోష్ ప్రదాన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అడ్మినిస్టేషన్ అధికారి హలధర్ శభర్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. గిరిజనులకు అవగహన కల్పించడం కోసం ఆరోగ్య శిబిరం, మార్కెట్ ఏర్పాటు చేశారు. వృద్ధులకు పింఛన్ పత్రాలు అందజేశారు.
హడ్డుబంగి గ్రామంలో..
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి హడ్డుబంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్‌కు స్పందన లభించింది. ఈ స్పందన కార్యక్రమానికి ఏడీఎం ఫుల్గుణి మఝి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, జిల్లా పరిషత్తు అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు. కిడిగాం, ఖరడ, కె.సీతాపురం, హడ్డుబంగి నుంచి మొత్తం 42 వినతులు అందాయి. అందులో వ్యక్తిగతం 23, గ్రామ సమస్యలకు సంబంధించినవి 19 ఉన్నాయి. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని ఏడీఎం అధికారులకు ఆదేశించారు. నేటి గ్రీవెన్స్‌కు సి.డి.ఎం.ఓ. డాక్టర్ ఎం.ఎం.అలీ, కాశీనగర్ బీడీఓ డంభుధర మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.
వినతుల వెల్లువ
వినతుల వెల్లువ
వినతుల వెల్లువ
వినతుల వెల్లువ


