
ఒడియా చలన చిత్ర రంగం బలోపేతానికి సన్నాహాలు
భువనేశ్వర్:
ఒడియా చలన చిత్రం రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత వాటాదారులు సమావేశమయ్యారు. స్థానిక సంస్కృత భవన్‌లో సోమవారం ఈ సమావేశం జరిగింది. ప్రముఖ ఒడియా చలనచిత్ర నటుడు, దిగొపొహండి నియోజక వర్గం ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. చలన చిత్ర నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు, రచయితలు, సంగీ తకారులు సహా చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒడి యా సినిమా రంగం వృద్ధి, మెరుగుదలపై వీరంతా పలు అభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వార్షిక ప్రధానోత్సవాన్ని సకాలంలో నిర్వహించడం సినీ రంగం కళాకారుల్ని ఉత్సాహపరుస్తుంది. నగదు పురస్కారాల పరిధి, 33 అవార్డు విభాగాల విస్తరణతో చలన చిత్ర రంగం కళాకారులకు ప్రోత్సహిస్తుందన్నారు. కొత్త చలనచిత్ర విధానాన్ని రూపొందించి చలన చిత్ర నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయడంతో చలన చిత్ర నిర్మాణానికి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఒడిశా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పనితీరును బలోపేతం చేసి కళింగ స్టూడియో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల సంఖ్యను పెంచి ప్రేక్షకులకు సరసమైన ధరలకు టికెట్లు అందించాలని అభ్యర్థించా రు. ప్రఖ్యాత సినీ నటులు అరిందమ్ రాయ్, శ్రిత మ్ దాస్, సబ్యసాచి మిశ్రా, హరిహర్ మహపాత్రో, నటి అర్చితా సాహు, పింకీ ప్రధాన్, అను చౌదరి, సంగీత విద్వాంసుడు దేబాశిష్ మహాపాత్రో, పంచానన్ నాయక్, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ దీప్తి మిశ్రా, ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక శా ఖ డిప్యూటీ కార్యదర్శి, దివ్య ప్రసాద్, సాహిత్యం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ దేవయాని భుంయ్యా, ఒడిశా సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ హొత్తా ఈ సమావేశంలో పాల్గొన్నారు.