
గ్రీవెన్స్‌సెల్‌కు విశేష స్పందన
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు విశేష స్పందన లభించింది. స్థానిక సమితి కార్యాలయం సమావేశ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్ అధ్యక్షతన వినతులు స్వీకరించారు. మొత్తం 15 వినతులు వచ్చాయి. వీటిలో ఎనిమిది వ్యక్తి గత..ఏడు గ్రామసమస్యలుగా అధికారులు గుర్తించారు. స్వీకరించిన సమస్యలను త్వరగా పరిష్కరించేందు కు కృషి చేయాలని నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గుణుపూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్‌కుమార్ ప్రధాన్, ఆర్టీవో శివశంకర్ చౌదరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ పాల్గొన్నారు.
పి.అంతరాడలో..
పర్లాకిమిడి: జిల్లాలోని నువాగడ బ్లాక్ పి.అంతరాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జాయింట్ గ్రీవెన్సు సెల్‌కు జిల్లా కలెక్టర్ బిజయ కు మార్ దాస్ హాజరయ్యారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి శంకర కెరకెటా, నువాగడ బ్లాక్ అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్ హాజరయ్యారు. స్పందన కార్యక్రమంలో కెరడంగా, నువాగడ, లుహాంగర్, అంతరాడ నుంచి 46 అభియోగాలు వచ్చాయి. అందులో నాలుగింటిని అధికారులు పరిష్కరించారు. గ్రామసమస్యలపై వచ్చిన 33 వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బీడీవో లోకనాథ్ శోబోరో, తహసీల్దార్ మోనాలిసా ఆచారి, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ అధికారి సంతోష్ నాయక్ పాల్గొన్నారు.
కలిమెల సమితిలో 27 వినతుల స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్రసభరో నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలపై 27 మంది వినతులను అందజేశారు. వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌సెల్‌కు విశేష స్పందన

గ్రీవెన్స్‌సెల్‌కు విశేష స్పందన