
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.
హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.
నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.
చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్
గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి.
నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది.
ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!