'ఐ' లవ్‌ యు అండ్‌ ప్లీజ్‌ టేక్‌ కేర్‌..! | Health Tips: bout Common Eye Disorders and Diseases | Sakshi
Sakshi News home page

'చూపే బంగారం'..! అంధత్వ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..

May 20 2025 10:00 AM | Updated on May 20 2025 3:20 PM

Health Tips: bout Common Eye Disorders and Diseases

చూసే ప్రక్రియలో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ఆ సమస్యలను వైద్యపరిభాషలో ‘విజువల్డిస్టర్‌బెన్సెస్‌’ అంటారు. అంటే... చూపులో కలిగే అంతరాయాలని అర్థం. ఇవి చాలా కారణాలతో వస్తాయి. అనేక సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. ఇందులో కొన్ని తాత్కాలికమైనవి. మరికొన్ని శాశ్వతంగా చూపును పోగొట్టేవి. అయితే తాత్కాలికమైనవే ఎక్కువ. కాకపోతే కొన్ని తాత్కాలికమైన వాటిని నిర్లక్ష్యం చేస్తే అది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలూ, చికిత్సలతో అంతా మామూలైపోయే ఈ అంతరాయాల గురించి తెలుసుకుందాం...

అన్ని అవయవాల్లోకీ చూపు వల్లనే దాదాపు 80% సమాచారం మనకు తెలుస్తుంది. అందుకే సర్వేంద్రియాణాంనయనం ప్రధానమనీ, కన్నుంటేనే కలికాలమనీ... ఇలాంటి ఎన్నో సామెతలూ,జాతీయాలూ, నుడికారాలూ ఉన్నాయి. అంతటి దృష్టిజ్ఞానానికి కలిగే అవరోధాలనూ, వాటిని పరిష్కరించుకునేమార్గాలను తెలుసుకోవడం అవసరం. ఆ అవరోధాలేమిటో, వాటిని అధిగమించే మార్గాలేమిటో చూద్దాం...

అంతరాయాలను గుర్తించే లక్షణాలు 
చూపునకు కలిగే అంతరాయాలు (దృష్టిదోషాలు) తాత్కాలికమైనవా లేదా దీర్ఘకాలికమైనవా అనేది కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయంటే... ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), ఒకే వస్తువు అనేక వస్తువులుగా  కనిపించడం (పాలియోపియా), మనం చూసే వస్తువు మసగ్గా కనిపించడం (బ్లర్రింగ్‌ ఆఫ్‌ విజన్‌), కళ్ల ముందు నల్లటి చుక్కలు లేదా మెరుపు తీగలు తేలిపోతున్నట్టు కనిపించడం (ఫ్లాషెస్‌ అండ్‌ ఫ్లోటర్స్‌), మనకు కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం జరగవచ్చు. దీన్ని వైద్యపరిభాషలో ‘స్కోటోమాస్‌’ అంటారు. 

ఫీల్స్‌ డిఫెక్ట్స్‌ : మనం చూసే ప్రాంతపు వైశాల్యమంతటా అంతా ఒకేలా కనిపించకపోవచ్చు. ఇలాంటి సమస్యలను ఫీల్డ్‌ డిఫెక్ట్స్‌ అంటారు. ఉదాహరణకు...

హెమీ అనోపియా...
దృశ్యంలో సగభాగం స్పష్టంగా ఉండి, మరో సగభాగం  స్పష్టంగా లేకపోవడం. 

  • క్వాడ్రాంటనోపియా : మనం చూసే ప్రాంతంలో పావు భాగం స్పష్టంగా లేకపోవడం. 

  • కన్‌స్ట్రిక్షన్‌ :  మనం చూసే దృశ్య వైశాల్యం రానురాను క్రమంగా తగ్గిపోవడం. 

  • టన్నెల్‌ విజన్‌ : కన్‌స్ట్రిక్షన్‌ సమస్య వచ్చాక ఒక సొరంగంలోంచి లేదా ట్యూబ్‌లోంచి ఎదుటి వస్తువును చూస్తున్నట్లు ఉండటాన్ని ‘టన్నెల్‌ విజన్‌’ అంటారు. 

  • కలర్‌డ్‌ హ్యాలోస్‌ : టన్నెల్‌ విజన్‌ కాకుండా ఒకవేళ రంగురంగుల వలయాలు ఉన్నట్లు భ్రమ కలగడమే ‘కలర్‌డ్‌ హ్యాలోస్‌’.  

  • లాస్‌ ఆఫ్‌ కలర్‌ విజన్‌ : ఒకవేళ కొందరిలో ఎదుటనున్న దృశ్యం  రంగుల్లో గాక నలుపు–తెలుపుల్లో కనిపించడాన్ని ‘లాస్‌ ఆఫ్‌ కలర్‌ విజన్‌’గా చెబుతారు. పైన పేర్కొన్న ఈ లోపాలన్నీ రకరకాల తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మనకు కనిపించే లక్షణాలుగా చెప్పవచ్చు.

తాత్కాలిక అంతరాయాలను  కలిగించే కొన్ని కంటి సమస్యలు 
మైగ్రేన్‌ : ఇది తీవ్రమైన తలనొప్పితో తాత్కాలికంగా కంటి చూపు కనిపించకుండా చేసే సమస్య. యువతలోనే ఎక్కువ. ఒకవైపు కంటిలోగాని లేదా తలలో ఒక పక్క గాని వచ్చే నొప్పి ఇది. అందుకే మామూలు వ్యక్తులు దీన్ని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పి వస్తున్నప్పుడు వికారంగా ఉండటం లేదా కొందరిలో వాంతులు కావడం జరుగుతుంది. కొందరిలో వాంతి తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. 

మరికొందరిలో ఏదో కాంతి ఆవరించినట్లుగా కనిపిస్తుంటుంది. దీన్నే ‘విజువల్‌ ఆరా’ అంటారు. మరికొందరిలో ‘స్కోటోమాస్‌’ రూపంలో కనిపించవచ్చు. అంటే ఎదురుగా కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం. ఇక మరికొందరిలో కళ్ల ముందు మిరిమిట్లు గొలిపే వెలుగు దివ్వెలు, మెరుపులూ కనిపించవచ్చు. 

చికిత్స : నొప్పిని తక్షణం తగ్గించే మందులతోపాటు... భవిష్యత్తులో ఈ తరహా తలనొప్పి రాకుండా నివారించే మందులు... ఇలా రెండు రకాల మందులను  ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడాలి. 

ట్రామా (గాయాలు):  కంటికి దెబ్బతగిలినప్పుడు తక్షణం కనిపించే లక్షణాలు, ఆ తర్వాత కనిపించే లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. చూపు మసకబారవచ్చు. కంటిముందు మెరుపులు కనిపించడం, వెలుగు రేకలు తేలుతున్నట్లు ఉండటం, కంటిలోని ద్రవం (విట్రియల్‌) బయటకు రావడం, దీర్ఘకాలంలో గ్లకోమా, రెటీనా పొరలు విడిపోవడం, కంటి నరం దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. 

చికిత్స : కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు (ట్రామా కేసుల్లో) అత్యవసరంగా తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం తక్కువ. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా దీర్ఘకాలం ΄ాటు ఫాలో అప్‌లో ఉండాలి. 

పొగతాగడం వల్ల: దీని వల్ల వచ్చే తాత్కాలిక అంధత్వం (టొబాకో ఆంబ్లోపియా) అన్నది ఆ అలవాటును మానివేయడం వల్ల తగ్గిపోతుంది. 

రే–చీకటి (నైట్‌ బ్లైండ్‌నెస్‌): ఇది ఆహారంలో విటమిన్‌–ఏ మోతాదులు తగ్గడం వల్ల కలిగే కంటి సమస్య. మరికొందరిలో ఇది రెటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంటే... రెటినైటిస్‌ పిగ్మెంటోజా వంటి వాటి వల్ల రావచ్చు. కొందరిలో హై మయోపియా (తీవ్రమైన దగ్గరి దృష్టి... అంటే చాలా దగ్గర్నుంచి చూస్తేగానీ స్పష్టంగా కనిపించకపోవడం) వల్ల లేదా గ్లకోమా వల్లగానీ ఈ సమస్య రావచ్చు.

లక్షణాలు : ఈ సమస్య వచ్చినవారిలో రాత్రిపూట సరిగా కనిపించకపోవచ్చు.  ఇక విటమిన్‌–ఏ లోపం తీవ్రంగా ఉన్నవారిలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది. 

వైద్యపరిభాషలో దీన్నే ‘కెరటోమలేసియా’ అంటారు. ఇది పిల్లల్లో ఎక్కువ. దీన్ని అత్యవసరమైన పరిస్థితిగా గుర్తించి చికిత్స అందించాలి. 

చికిత్స : ఆహారంలో తగినంత విటమిన్‌ ఏ ఉన్న పదార్థాలు ఇవ్వడం, విటమిన్‌–ఏ మాత్రలు వాడటం, ముందస్తు నివారణగా (్ర΄÷ఫిలాక్టిక్‌  చికిత్సగా) విటమిన్‌–ఏ ఇస్తారు.

డ్రగ్స్‌ : కార్టికోస్టెరాయిడ్స్, కీళ్లనొప్పుల కోసం దీర్ఘకాలం పాటు వాడే కొన్ని రకాల మందులు, క్షయవ్యాధికి వాడే కొన్ని మందుల వల్ల స్కోటోమాస్‌ వచ్చి క్రమంగా చూపు తగ్గుతూ పోవచ్చు. ఒక్కోసారి ఇది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. అందుకే చూపు తగ్గుతున్నట్లు గ్రహించగానే డాక్టర్‌ను సంప్రదించి, వాడుతున్న మందులను వివరించి, తగిన చికిత్స తీసుకోవాలి. దాంతో కోల్పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. 

పక్షవాతం (స్ట్రోక్‌ ): పక్షవాతం వచ్చినవారిలో మెదడులోని కొన్ని భాగాలకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. మెదడులో చూపునకు సంబంధించిన ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గితే తాత్కాలికంగా చూపునకు అంతరాయం కలగవచ్చు. మామూలుగానైతే ఇది తాత్కాలిక సమస్య. అయితే అతి కొద్ది సందర్భాల్లో మాత్రం ఇది శాశ్వత అంధత్వానికీ దారితీయవచ్చు. 

చికిత్స : ఇందులో నివారణే చికిత్సతో సమానం. డయాబెటిస్‌ను, రక్త΄ోటును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ ముప్పును తప్పించుకోవచ్చు. 

బ్రెయిన్‌ ట్యూమర్స్‌ : మెదడులో వచ్చే గడ్డలు... చూపును మెదడుకు చేరవేసే ‘ఆప్టిక్‌ నర్వ్‌’ను నొక్కివేయడం వల్ల గానీ లేదా కంటికీ, నరానికీ రక్తప్రసరణనిచ్చే రక్తనాళాన్ని నొక్కివేయడం వల్ల గానీ అంతరాయం కలగవచ్చు. దాంతో ఒక్కోసారి ΄ాక్షిక అంధత్వం రావచ్చు. లేదా మొత్తం దృశ్యం కాకుండా సగమే కనిపించవచ్చు. ఇలాంటప్పుడు తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఒకవేళ గడ్డలుంటే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగింపజేసుకోవాలి. అప్పుడు చూపు చాలావరకు మళ్లీ రావచ్చు.

డయాబెటిక్‌ రెటినోపతి : డయాబెటిస్‌ ఉన్నవారిలో కంటికి రక్తాన్ని అందించే అత్యంత సూక్ష్షా్మతి సూక్ష్మమైన రక్తనాళాల్లోని లోపలి ΄÷ర ఎండోథీయమ్‌ కణాలు మృతిచెందడం వల్ల రెటీనాకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. దాంతో రెటీనా దెబ్బతినే అవకాశాలెక్కువ. ఇది చూపు కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. 

లక్షణాలు : చిన్న అక్షరాలు చదవడం కష్టం కావచ్చు. క్రమంగా లేదా అకస్మాత్తుగా చూపు తగ్గవచ్చు. కళ్ల ముందు ఏవో కాంతిపుంజాలు తేలుతున్నట్లు (ఫ్లోటర్స్‌) కనిపించవచ్చు. 

చికిత్స : తక్షణ లేజర్‌ చికిత్సతోగానీ లేదా కంటిలో ఇచ్చే ఇంజెక్షన్లతో గాని లేదా శస్త్రచికిత్స ప్రక్రియల ద్వారాగాని చూపు మరింత దిగజారకుండా ఆపే అవకాశాలుంటాయి. కాబట్టి డయాబెటిస్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా తమ కంటి  పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 

క్యాటరాక్ట్‌ (తెల్ల ముత్యం ): వయసు పెరుగుతున్న కొద్దీ కంటిలో ఉండే లెన్స్‌ తన పారదర్శకతను కోల్పోతుంది. ఫలితంగా దృష్టి మసకబారడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం, చూపు సన్నగిల్లడం, రాత్రివేళ చూడటం కష్టమైపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

చికిత్స : అత్యంత సాధారణమైన శస్త్రచికిత్స ద్వారా కంటిలోని లెన్స్‌ను మార్చి మరో పారదర్శకమైన లెన్స్‌ అమర్చడం వల్ల  మళ్లీ మామూలుగానే చూడటం సాధ్యపడుతుంది.   

చూపు అంతరాయాల్లో తాత్కాలికం... దీర్ఘకాలికం... 
వివిధ వ్యాధులు, రుగ్మతలు చూపునకు అంతరాయం కలిగించవచ్చు. అయితే అందులో కొన్ని తాత్కాలికమైనవి. చికిత్స తీసుకుంటే నయమై చూపు మామూలుగా వచ్చేస్తుంది. అయితే కొన్ని అవరోధాలు మాత్రం కాస్తంత దీర్ఘకాలిక చికిత్స అవసరమైనవి. 

చూపునకు కలిగే కొన్ని రకాల సమస్యలు లేదా అంతరాయాలు క్రమంగా పెరుగుతూ΄ోయి, వాటి కారణంగా దీర్ఘకాలికంగా ముప్పు కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే వీటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని... 

గ్లకోమా : కంటిలో ఉన్న ద్రవాలు కొంత ఒత్తిడిని కలగజేస్తుంటాయి. ఈ ఒత్తిడినే ‘ఇంట్రా ఆక్యులార్‌ ప్రెషర్‌’ అంటారు. అయితే కొందరిలో ఈ ఒత్తిడి క్రమంగా పెరిగిపోతూ ఉండటం వల్ల వారికి కనిపించే దృష్టి వైశాల్యం (ఫీల్డ్‌ ఆఫ్‌ విజన్‌) క్రమంగా కుంచించుకుపోతూ / తగ్గిపోతూ ఉంటుంది. ఇలా క్రమంగా తగ్గిపోవడాన్ని / కుంచించుకుపోతూ ఉండటాన్ని  ‘కన్‌స్ట్రిక్షన్‌ ఆఫ్‌ ఫీల్డ్‌’ అంటారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి చికిత్స తీసుకోకపోతే అతడి చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలా కంటిలోని ద్రవాల ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే వ్యాధిని గ్లకోమా అంటారు. 

లక్షణాలు : గ్లకోమా ఉన్నవారిలో చూసే వైశాల్యం (ఫీల్డ్‌) క్రమంగా కుదించుకుపోతుంది. ఇది ఒక్కోసారి క్రమంగా జరగవచ్చు లేదా కొందరిలో అకస్మాత్తుగానూ జరగవచ్చు. ఇక కంటిముందు నల్లమచ్చలాంటి వెలుగు, దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం, లోతైన సొరంగంలోకి చూస్తున్న ఫీలింగ్‌ (టన్నెల్‌ విజన్‌) ఉండవచ్చు. 

ఇంట్రా ఆక్యులార్‌ ప్రెషర్‌ అదుపులో ఉండేలా చికిత్స తీసుకోకపోతే ఈ లక్షణాలు క్రమంగా పెరుగుతూ పోయి చివరకు శాశ్వతంగా దృష్టి కోల్పోయే ముప్పు ఉంటుంది.  

చికిత్స : గ్లకోమాకు చికిత్స మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది మందులతో ఇంట్రా ఆక్యులార్‌ ప్రెషర్‌ను పెరగకుండా అదుపులో ఉంచడం. రెండోది లేజర్‌ చికిత్స. దీని తర్వాత కూడా ఇంట్రా ఆక్యులార్‌ ప్రెషర్‌ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.  

హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి : మన దేహంలోని అన్ని అవయవాలతో ΄ాటు కంటికీ నిత్యం రక్తప్రసరణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రక్త΄ోటు ఉన్నవారిలో రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు అత్యంత సన్నటి రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్‌) ఆ ఒత్తిడికి చిట్లి΄ోయే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు కోల్పోయే ముప్పు ఉంటుంది. 

లక్షణాలు : చూపు మసకబారడం, ఒకవైపు సక్రమంగా కనిపించక΄ోవడం లేదా చూసే ఏరియా (వైశాల్యం) తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. 

చికిత్స : ఈ సమస్య వల్ల చూపు కోల్పోకుండా ఉండేందుకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడమే మంచి నివారణ చర్య. ఇలాంటి సమస్య ఉన్న  కొందరిలో లేజర్‌ లేదా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. 

ఏఆర్‌ఎమ్‌డీ : ఇది వయసుతో పాటు వచ్చే కంటి సమస్య. ‘ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌ డీజనరేషన్‌’ అనే ఇంగ్లిష్‌ పదాల సంక్షిప్త రూపమే ఈ  ‘ఏఆర్‌ఎమ్‌డీ’. కంటి రెటీనాలోని ‘మాక్యులా’ అని పిలిచే మధ్యభాగం తీవ్రంగా ప్రభావితమైపోవడంతో ఈ సమస్య వస్తుంది. 

లక్షణాలు : ఈ సమస్య ఉన్నవారిలో ‘స్కోటోమాస్‌’ రావచ్చు. ఇక వస్తువు –  రూపం ఉన్నది ఉన్నట్లు గాక తీవ్రంగా మారి (డిస్టార్షన్‌) కనిపించవచ్చు. ఉన్న వస్తువు కంటే కనిపించేది చిన్నదిగా ఉంటే దాన్ని ‘మైక్రోప్సియా’ అంటారు. ఉన్న వస్తువు పరిమాణం కంటే కనిపించేది పెద్దదిగా ఉంటే దాన్ని ‘మ్యాక్రోప్సియా’ అంటారు. వస్తువు రూపం పూర్తిగా మారిపోతే దాన్ని ‘మెటామార్ఫోప్సియా’ అంటారు. 

చికిత్స : ఈ సమస్య ఉన్నవారికి కంటి  డాక్టర్లు లేజర్‌ చికిత్స ద్వారాగానీ లేదా కంటిలోని విట్రియల్‌ ఛేంబర్‌ అనే ప్రాంతంలో ఇంజెక్షన్స్‌ ఇవ్వడం వల్లగానీ లేదా శస్త్రచికిత్సతో గాని సమస్యను మరింతగా పెరగకుండా నిలువరించేందుకు అవకాశాలెక్కువ.  

కెరటోకోనస్‌ వ్యాధి : సాధారణంగా గమనించి చూస్తే మన కంటి నల్ల గుడ్డు ప్రాంతం ఒకింత ఉబ్బెత్తుగా కనిపిస్తూ గుండ్రం (స్ఫెరికల్‌)గా ఉంటుంది. కానీ కెరటోకోనస్‌ అనే కండిషన్‌ ఉన్నవారిలో ఈ ఉబ్బెత్తుగా ఉండేభాగం కోణం (కోన్‌) ఆకృతిని సంతరించుకుంటుంది. ఈ కండిషన్‌నే ‘కెరటోకోనస్‌’ అంటారు. 

లక్షణాలు : ఈ కండిషన్‌ ఉన్నవారు సౌకర్యంగా చూడలేరు. అంతా మసగ్గా  కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు తాము చూసే దృశ్యం కదిలిపోతున్నట్లు, వణుకుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. 

చికిత్స : కాంటాక్ట్‌లెన్స్‌లతో చికిత్స చేయవచ్చు. ‘కొలాజెన్‌ క్రాస్‌ లింకింగ్‌’ ప్రక్రియ అవసరపడవచ్చు.‘కెరటోప్లాస్టీ’ అనే చికిత్స చేయాల్సి రావచ్చు. 

రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌ (దృష్టిలోపాలు) : సరైన అద్దాలు వాడటం ద్వారా  తరహా కంటి సమస్యలను అధిగమించవచ్చు. వీటినే రిఫ్రాక్టివ్‌ లోపాలు అంటారు. కొందరికి చాలా దగ్గరి నుంచి చూస్తేగాని వస్తువులు స్పష్టంగా కనిపించవు. దీన్నే ‘మయోపియా’ లేదా ‘నియర్‌సైటెడ్‌నెస్‌’ అంటారు. 

ఇక కొందరు ఆ వస్తువులను మరింత దూరంగా ఉంటే తప్ప స్పష్టంగా చూడలేరు. ఈ కండిషన్‌ను ‘హైపరోపియా’ లేదా ‘ఫార్‌సైటెడ్‌నెస్‌’ అంటారు. ఇక కొందరిలో గ్రాఫ్‌లో ఉన్న అడ్డు, నిలువు రేఖలు ఒకేసారి కనిపించవు. ఈ సమస్యను ‘ఆస్టిగ్మాటిజమ్‌’ అంటారు. 

సరిదిద్దడమిలా : ఈ రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌ను తగిన అద్దాలను ఉపయోగించి సరిచేయవచ్చు. కేవలం ఈ అద్దాలతోనే వాళ్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. కాబట్టి దీని గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. అలాగని చికిత్స తీసుకోకుండా ఉన్నా, తగిన అద్దాలు వాడకపోయినా సమస్య మరింత  తీవ్రం కావచ్చు. 

మెల్లకన్ను : ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్‌’ అనే ఈ కండిషన్‌ను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ కండిషన్‌లో కుడి, ఎడమ కనుగుడ్లలో ఏదో ఒకటి లోపలివైపునకో, బయటికో చూస్తుంటుంది. సాధారణంగా మెల్లకన్ను ఉన్నవారికి ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మసకగా కనిపించడం, తలనొప్పి, వాంతులు ఉండవచ్చు. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరు దీన్ని అదృష్టంగా కూడా పరిగణిస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో చూపు పూర్తిగా పోయే ముప్పు కూడా ఉంటుంది.  
చికిత్స : మెల్లకన్నుకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలి. 

ఇవే కాకుండా... డబుల్‌ విజన్, ఫ్లాషెస్, స్కోటోమాస్, హాఫ్‌ ఫీల్డ్‌ లాస్, ప్రాప్టోసిస్, రంగుల వలయాల వంటివి కనిపిస్తే వీలైనంత త్వరగా కంటి వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సిందే. లేకపోతే చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

(చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement