
మహిళా శిశు సంక్షేమ కమిటీ పర్యటన
జయపురం: తొమ్మిది మంది సభ్యులతో కూడిన మహిళా, శిశు సంక్షేమ హౌస్ కమిటీ కొరాపుట్ జిల్లాలో పర్యటిస్తోంది. శాసన సభ్యురాలు మహి ళా, శిశు గృహ కమిటీ అధ్యక్షురాలు సీమారాణి నా యిక్ నేతృత్వంలో రెండు దినాల పర్యటన నిమిత్తం వచ్చిన కమిటీకి జయపురం విమానాశ్రయంలో కొరాపుట్ కలెక్టర్ వి,కీర్తి వాసన్, ఎస్పీ రోహిత్ శర్మ, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, జయపురం సబ్ కలెక్టర్ శొశ్య రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.సీమా రాణి నాయిక్ నేతృత్వంలో శాశన సభ్యులు ప్రమీళ మల్లిక్, బర్షా సింగ్ బారిహ, సుజాత సా హు, సంజలి ముర్ము, ఉపాసన మహాపాత్రో, సుభా షిని జెన, మనోరమ మహంతి, షోపియ పిర్దెస్ అధికారులతో మాట్లాడారు. వారు తమ పర్యటన లో దుదారి లోగల కాఫీ తోటలు, మండియ(ఛోళ్లు) ప్రోసెసింగ్ యూనిట్‌లను పర్యటించి స్వయం సహాయక గ్రూపు మహిళా సభ్యులతో మాట్లాడి వా రి సమస్యలను తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు దేవమాళీ పర్వత పర్యాటక ప్రాంతంలో విడిది చేశారు.