
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు కేన్సర్ తీవ్రతరమైన స్థాయిలో ఉందని ఆయన కార్యాలయం వెల్లడించింది. వైద్య పరీక్షల్లో బైడెన్‌కు తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎముకలకు వ్యాపించిందని చెబుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ గత కొన్ని రోజులుగా మూత్ర విసర్జన సంబంధిత సమస్యలతో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా..ఈ విషయం వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. చెప్పాలంటే బైడెన్ సివియర్ కేన్సర్ స్టేజ్‌తో పోరాడుతున్నారు. త్రీవతరమైన దశలో ఉన్న ఈ కేన్సర్‌ని నిర్వహించడం సులభమేనని త్వరితగతిని ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకుంటారని బైడెన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే ఈ కేన్సర్ ఏవిధంగా ప్రాణాంతకంగా మారుతుందా..? ఆ కేన్సర్ కణాలు ఎముకలకు వ్యాపించడం అంటే..
ప్రోస్టేట్ కేన్సర్(Prostate cancer)ని వైద్యులు మొదటగా ఏ స్థాయిలో ఉందో నిర్థారిస్తారు. ఇక్కడ బైడెన్‌కు 9 స్కోరుతో అత్యంత తీవ్ర స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉందని వెల్లడైంది. పైగా ఆ కేన్సర్ ఎముకల వరకు వ్యాపించిందని తెలిపారు. అదెలా జరుగుతుందంటే..
ప్రోస్టేట్ కేన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుతుంది. ఒక్కోసారి శరీరంలోని ఇతర భాగాలకు అంటే..ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అంటే ఇక్కడ వెన్నెముక, తుంటి, పెల్విస్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుందట. ఈ దశని క్రిటికల్ స్టేజ్‌గా పేర్కొన్నారు వైద్యులు. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి, వెన్నుపాము కుదింపు, చలశీలతకు సంబంధించిన సమస్యలు ఉత్ఫన్నమవుతాయిని చెబుతున్నారు.
అంతేగాదు ప్రోస్టేట్ కేన్సర్ ఎముక నిర్మాణాన్ని ప్రేరేపిస్తుందట. ఎముకను పెళుసుగా మార్చి విరిగిపోయేలా చేస్తుందట. అందువల్ల ఆయా బాధితులకు రాత్రిపూట ఎముక సంబంధిత నొప్పులు తీవ్రతరమవుతాయట. అందులోనూ 80 ఏళ్లు పైబడిన వారిలో, ఎముకలకు వ్యాపించే ప్రోస్టేట్ కేన్సర్ అనేది అత్యంత ప్రాణాంతకమైదిగా పేర్కొన్నారు నిపుణులు.
ముందస్తుగా ఎలా గుర్తించాలంటే..
బాడీ వెనుక లేదా తుంటిలో నిరంతర ఎముక నొప్పి. నాడీ సంబంధిత సమస్యలను అలక్ష్యం చేయకూడదు. బయాప్సీ ఫలితాల ఆధారంగా ప్రోస్టేట్ కేన్సర్ స్టేజ్‌ని నిర్థారిస్తారు.
చికిత్స: హార్మోన్ థెరపీ, రేడియేషన్, కీమోథెరపీ, ఎముకలను లక్ష్యంగా చేసుకునే శస్త్రచికిత్సలతో నయం చేస్తారు.
ఇంత ప్రాణాంతక స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నప్పుడూ..పూర్తినివారణ సాధ్యం కాదని చెబుతున్నారు నిపుణులు. కేవలం దాన్ని నిర్వహించగలం.. అంతే అన్నారు. ఇక్కడ రోగి జీవన నాణ్యత మెరుగుపరిచేలా చికిత్స అందిస్తారు. కేవలం ఆయా బాధితులు మూత్ర సంబంధిత సమస్యలకు, ఎముకల బలం కోసం విటమిన్ డి స్లపిమెంట్స్ వంటి వాటితో చికిత్స అందించి పరిస్థితి మెరుగుపడేలా చేయగలరే తప్ప పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి బయటపడటం జరగదని తెలిపారు. అలాగే కొన్ని రకాల కేన్సర్‌లను మొదటి స్టేజ్‌లో ఉంటేనే పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యపడుతుందని నొక్కి చెబుతున్నారు వైద్యులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..! )