త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది.
కాళేశ్వరంలో భక్తుల సందడి
పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు


