
మైదానం అభివృద్ధికి వినతి
పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్రగజపతి స్వయం ప్రతిపత్తి కళాశాల మైదానం అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గజపతి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని ఇదివరకు సమర్పించారు. దీనిపై ‘సాక్షి’తో పాటు అనేక పత్రికల్లో కళాశాల మైదానం దీనస్థితిపై కథనాలు వచ్చాయి. ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి సూర్యవంశీ సూరజ్‌కు లేఖ రాశారు. మహారాజా కళాశాల ఒడిశాలో హెరిటేజ్ భవనం అని, ఇక్కడ స్పోర్ట్స్ మైదానం అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు క్రీడాకారులకు కల్పించాలని కోరుతూ రాసిన వినతిని ఎంపీ ప్రతినిధి దారపు రాజేష్‌కుమార్ (చిట్టి) భువనేశ్వర్‌లో మంత్రి సూర్యవంశీ సూరజ్‌కు అందజేసినట్టు తెలియజేశారు. దీనిపై డీఆర్‌డీఏ శాఖ రూ.95 లక్షలతో ప్రతిపాదనలు డైరెక్టర్ ఉన్నత విద్యాశాఖకు పంపించారు.