
హీరో విశాల్ (Vishal) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు

నటి సాయి ధన్సికను (Sai Dhanshika) ఆగస్టు 29న పెళ్లాడనున్నారు

నడిగర్ సంఘం భవనం ప్రారంభోత్సవం తర్వాత పెళ్లి అంటూ విశాల్ ప్రకటన

విశాల్ అనుమతితో పెళ్లి విషయాన్ని ప్రకటించిన సాయి ధన్సిక

ఆగస్టు 29న విశాల్ పుట్టిన రోజు నాడే వారిద్దరూ ఏడడుగల బంధంలో అడుగుపెడుతున్నారు

‘కబాలి’లో రజనీకాంత్ కూతురిగా నటించిన ధన్సిక ఆపై షికారు, అంతిమ తీర్పు, దక్షిణ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది

ధన్సిక నటించిన యాక్షన్ మూవీ ‘యోగీ దా’ ఆడియో వేడుకతో వారి పెళ్లి వార్తలకు వేదిక అయింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో ధన్సిక నటిస్తుందని ప్రకటించిన విశాల్



