పోడియా సమితిలో గిరిజనులకు వింత వ్యాధి | - | Sakshi
Sakshi News home page

పోడియా సమితిలో గిరిజనులకు వింత వ్యాధి

May 20 2025 1:12 AM | Updated on May 20 2025 1:12 AM

పోడియ

పోడియా సమితిలో గిరిజనులకు వింత వ్యాధి

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా పోడియా సమి తి క్రిస్టియన్‌ వీధి, డైలీ మార్కెట్‌, శాంతి నగర్‌ వీధుల్లో నివసిస్తున్న గిరిజనులు నెల రోజులు గా వింత వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి మొదట చిన్న పిల్లల్లో కనిపించింది. పిల్లలకు కడుపు నొప్పి, చేతులు, కాళ్లు, ముఖం వాచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నా యి. పోడియా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి మందు లు వేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ వాపుల వల్ల చాలా మంది నడవలేక పోతున్నారు. శరీరం కూడా నలుపు రంగులోకి మారిపోతోంది. దీనిపై కొందరు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాన్ని పంపిస్తానని ఆయన తెలిపారు.

ఆరేళ్లకే ఆయువు తీరింది

పొందూరు: పొందూరు–చిలకపాలెం రహదారిలోని ఎరుకులపేట కూడలి వద్ద సోమవా రం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం గోకర్నపల్లి పంచాయతీ రంగనాథపేట గ్రామానికి చెందిన పేడాడ హరిబాబు, ఈశ్వరమ్మ దంపతులకు వెంకటసూర్య యువంత్‌(6) అనే కుమారుడు ఉన్నాడు. యువంత్‌ తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేటలో చిన్న తాతయ్యను చూసేందు కు వచ్చాడు. అక్కడి నుంచి చిలకపాలెం వెళ్లేందుకు తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేట బస్టాప్‌కు బయలుదేరాడు. బస్టాప్‌ నుంచి రహదారి అవతలవైపు ఆటో ఆపేందుకు తండ్రి హరిబాబు వెళ్లాడు. తండ్రి దగ్గరకు వెళ్లాలనే ఆతృతతో తల్లి ఈశ్వరమ్మ చేయిని వదిలి బాలుడు పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వెళ్లాడు. అదే సమయంలో చిలకపాలెం నుంచి పొందూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనం బాలుడి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని పొందూరులోని ప్రైవే టు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్‌ లేకపోవడంతో 108 వాహనంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. తండ్రి హరిబాబు విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. కాగా, బాలుడి మృతితో రంగనాథపేటలో విషాద ఛా యలు అలముకున్నాయి. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

నరసన్నపేట: కోమర్తి వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవరుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటంతో మృతుడి పూర్తి వివరాలు తెలియలేదు. నరసన్నపేట వైపు నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు ప్రమాద సంఘటన బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ప్రదేశంలో వద్ద ఇసుక ఉండటంతో ఇసుక ట్రాక్టర్‌ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనంపై ఓడీ 33ఏ డీ2053 నంబరు ఉంది. దీంతో ప్రమాదానికి గురైన వారు ఒడిశావాసులుగా పోలీసులు భావిస్తు న్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

సర్పాల సయ్యాట

పొందూరు రూరల్‌ : మండల కేంద్రం పొందూరులోని అఫీషియల్‌ కాలనీలో రిటైర్డ్‌ ఉద్యోగి బేత కృష్ణారావు ఇంటి పక్కన సోమవారం సాయంత్రం నాగుపాము, జెర్రిపోతులు సయ్యాట ఆడాయి. ఒక్కసారిగా పాములు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోడియా సమితిలో  గిరిజనులకు వింత వ్యాధి 1
1/2

పోడియా సమితిలో గిరిజనులకు వింత వ్యాధి

పోడియా సమితిలో  గిరిజనులకు వింత వ్యాధి 2
2/2

పోడియా సమితిలో గిరిజనులకు వింత వ్యాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement