
దుబాయ్ కంపెనీ చేతికి సేవా పేపర్ మిల్లు!
జయపురం: కొన్ని నెలలుగా మూతపడి ఉన్న సేవా పేపరు మిల్లు తిరిగి ఉత్పత్తి ప్రారంభించే దిశగా యాజమాన్యం పావులు కదుపుతోంది. ప్రస్తుత హైదరాబాద్ యాజమాన్యం దుబాయి కంపెనీకి నిర్వహణ అప్పగించనుందనే ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే శుక్రవారం భువనేశ్వర్‌లో పరిశ్రమల విభాగ కార్యదర్శి హేమంత శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జయపురం సమితి గగణాపూర్‌లోని సేవా పేపరుమిల్లు రెండు నెలల్లో తిరిగి తెరిచేందుకు నిర్ణయించారు. సమావేశంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, దుబాయ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.