
సోషల్ మీడియాతో వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దాం
వైఎస్సార్‌సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్‌లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్‌లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండి
చదవండి: మెట్రోలో ఇన్‌ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్