
అథ్లెట్లకు ఐడీ కార్డులు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఐడీ కార్డులను అందజేయడంతో పాటు వారి ప్రగతి, గణాంకాలు, ట్రాక్ రికార్డులన్నీ అందులోనే నమోదు చేస్తామని అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలో నిర్వహించారు. ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు) సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) విధానాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో క్రీడాకారుల ఎంట్రీలను నమోదుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా ఎంట్రీలు జరిగేవని.. ఇకపై స్కూల్ సర్టిఫికెట్, స్టడీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎంట్రీ నమోదు చేయనున్నట్లు స్పష్టం చేవారు. 2025–26 సీజన్‌కుగాను స్టేట్ షెడ్యూల్ వెలువడలేదని, వచ్చిన వెంటనే జిల్లాస్థాయి ఎంపికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, నౌపడ విజయ్‌కుమార్, బీవీ రమణ, పి.తవిటయ్య, కె.గోపి, కె.హరిబాబు, కె.మాధవరావు, సుజాత, బి.నారాయణరావు, మురళి, రామారావు, ఇచ్ఛాపురం, కాశీబుగ్గ, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం, పాలకొండ తదితర క్లబ్స్ నుంచి పీడీలు, కోచ్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.