శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం | - | Sakshi
Sakshi News home page

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం

May 14 2025 1:13 AM | Updated on May 14 2025 1:13 AM

శ్రీజ

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం

పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో పునర్నిర్మాణంలో ఉన్న శ్రీజగన్నాథ మందిరానికి పుష్పాంజలి పాఢి రూ.3,00,101 విరాళంగా అందజేశారు. మంగళవారం ఆలయ కమిటీకి చెక్కును అందజేశారు.

ఘనంగా బుద్ధ జయంతి

జయపురం: కొరాపుట్‌ జిల్లాలో మొదటి సారి బుద్ధ జయంతి వేడుకలు జరిగాయి. జయపురం సబ్‌డివిజన్‌ బొరిగుమ్మ సమితి అవుంలి గ్రామ కూడలి వద్ద సోమవారం సాయంత్రం వేడుకలు చేశారు. అవుంలి పార్క్‌ లోగల భారీ బుద్ధ విగ్రహానికి పూజలు చేశారు. శాంతి, అహింస, ధర్మం, కారుణ్యం తదితర విలువలు బోధించారు. ఉత్సవంలో అవుంలి సర్పంచ్‌ హీరామణి పూజారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

20న అఖిల భారత సమ్మె

పర్లాకిమిడి: ఈ నెల 20వ తీదీన రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సమ్మెను ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు స్థానిక దండుమాలవీధిలో సీపీఎం కార్యాలయంలో అఖిల భారత కిసాన్‌ సభ నాయకులు బంగారయ్య, బి.కె.ఎం.యు రాష్ట్ర కమిటీ సభ్యులు జోన్న సుభాష్‌ చంద్రరావు, టి.యు.సి.సి పైల మురళీకృష్ణ, ఏ.ఐ.కె.ఎం.ఎస్‌ కేదార్‌ శబర, ఏ.ఐ.టి.యు.సి కార్యదర్శి దండపాణి రయితో, శ్రీనివాస్‌ బెహరా తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్‌లు రద్దు చేయాలని, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని, స్కీమ్‌ వర్కర్లకు శ్రామిక హోదా ఇవ్వాలని, నిత్యావసర వస్తువులు అందించాలని, పలు డిమాండ్లతో ట్రేడ్‌ యూనియన్లు సమ్మె చేయనున్నాయని జోన్న సుభాష్‌ చంద్రరావు తెలిపారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

250 కిలోల

గంజాయి స్వాధీనం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి పాతచిమాటపల్లి పంచాయతీ బండిగూఢ గ్రామంలో అడవిలో పది బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిపై ముందస్తు సమాచారం అందడంతో ఐఐసీ ధీరజ్‌ పట్నాయిక్‌ సోమవారం సాయంత్రం సిబ్బందితో దాడి చేశారు. దీంతో మాఫియా అంతా పరారైపోయింది. పది బస్తాల్లో 250 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని తెలిపారు.

చోరీ కేసులో ముగ్గురు అరెస్టు

రాయగడ: చోరీ కేసుకు సంబంధించి జిల్లాలోని కాసీపూర్‌ సమితి టికిరి పోలీసులు మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి పికప్‌ వ్యాన్‌, 4 ఫోన్లు, 48 హెచ్‌బీఎల్‌ డ్రై సెల్‌ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నింతులను కోర్టుకు తరలించారు. నిందితుల వివరాలను వెల్లడించలేదు.

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి  రూ.3 లక్షలు విరాళం 1
1/4

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి  రూ.3 లక్షలు విరాళం 2
2/4

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి  రూ.3 లక్షలు విరాళం 3
3/4

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి  రూ.3 లక్షలు విరాళం 4
4/4

శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement