
ఒడిశాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం
భువనేశ్వర్:
ఒడిశా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమని, పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడితే ఎదుగదల అసాధ్యమని, అందుకే రాష్ట్రాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం మోహన్ చరణ్ మాఝీ అన్నారు. తయారీకి అవసరమైన ముడి పదార్థాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్ర పారిశ్రామికీకరణ సామర్థ్యా న్ని సఫలీకృతం చేసుకుని ఒడిశాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మలచడం సులభతరమేనని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. రాష్ట్రం ఖనిజ ఉత్పత్తులను వ్యాట్ విధానాన్ని అవలంబించింది. వ్యవస్థాపకత ద్వారా వేగవంతమైన పారిశ్రామికీకరణకు ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు.
ఖనిజ వనరులతో తులతూగే రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి జాతీయ ఖనిజ వనరులలో రాష్ట్ర వాటా 41.9 శాతంతో అగ్రగామిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. స్థానిక ఓయూఏటీ కృషి శిక్షా సదన్‌లో శుక్రవారం నిర్వహించిన ఓఎంసీ 70వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సుకు ఓఎంసీ బలమైన పనాదిగా నిలిచింది. ప్రకృతిపరమైన ఖనిజ వనరులను బాధ్యతాయుతంగా అన్వేషిస్తూ క్రమబద్ధీకరణతో తవ్వకాలు చేపట్టి ఈ సాఫల్యత సాధించిందని అభినందించారు. ఓఎంసీ 60 దశకంలో కేవలం రూ. 1 కోటి ఆర్థిక లావాదేవీలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 23,600 కోట్ల ఆర్థిక లావా దేవీల స్థాయికి చేరిందని అన్నారు. ఈ లావాదేవీ పూర్తిగా ఖనిజాల ఉత్పత్తి, అమ్మకం ద్వారా సాధ్యం చేసుకుందన్నారు. నేడు జాతీయ స్థాయిలో ఖనిజ ఉత్పత్తి కంపెనీలలో ఓఎంసీ 5వ అగ్ర స్థానంలో ఉందని, దేశ వ్యాప్తంగా లాభాలను ఆర్జించే ఆదర్శ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా స్థిరపడిందని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో మార్గదర్శిగా నిలిచి దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బొడొబిలొ డుబుణ ఇనుప ఖనిజ గనులు, తిరింగి కొండ ప్రాంతంలో గనులు తవ్వకం పునఃప్రారంభించారు. ఈ ప్రాంతంలోని రెంగాలిబెడా ఆర్‌ఆర్ కాలనీకి విద్యుత్ సరఫరా, కొయిడా మైనింగ్ ప్రాంతంలో ఉన్న ఓఎంసీ గనుల లో 900 కిలో వాట్ పీక్ సోలార్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కంపెనీ పనితీరును మరింత మెరుగుపరచడానికి నాలుగు ఐటీ విభాగా లు స్థాపించినట్లు ప్రకటించారు. వాటిలో లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్), ఓఎంసీ ఫైనా న్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓఎఫ్‌ఎంఎస్), ఓఎంసీ ప్లాట్ ల్యాండ్ యుటిలైజేషన్ సిస్టమ్ (ఓప్లస్) మరియు ఓఎంసీ రిక్రూట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్ట మ్ (ఓఆర్‌ఎంఎస్) వంటి మాడ్యులర్ సిస్టమ్‌లు ఉన్నాయి. 2023–24, 2024 –25 సంవత్సరాలకు ఉత్తమ మైనింగ్ రంగం, ఉత్తమ గని, సురక్షితమైన గని అనే మూడు విభాగాలలో ముఖ్యమంత్రి అవా ర్డులను అందజేశారు. 3 విభాగాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ముఖ్యమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ సీఎస్‌ఆర్ ఆధారిత కార్యక్రమాల ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక రంగం ముఖచిత్రం ఆవిష్కరణతో ఓఎంసీ పాత్రను ప్రసంశించారు. నేటి నుంచి ఓఎంసీ ఆధీనంలో 18 గనులు పనిచేయడం ప్రారంభించాయని అన్నారు. ఈ చర్య ఖనిజాలను ఉత్పత్తి చేయడంతో బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్ర ఆవిష్కరణకు పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓఎంసీ అధునాతన తయారీ, అత్యాధునిక సాంకేతికత ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తుందన్నారు. సహజ వనరులను సద్వినియోగపరచుకుని బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థకు ఎదిగామని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ అన్నారు. ఓఎంసీ నిరంతర అభివృద్ధ్ధి ప్రక్రియలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో నిమగ్నం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గనులు, ఉక్కు శాఖ అదనపు ప్రధా న కార్యదర్శి, ఓఎంసీ చైర్మన్ సురేంద్రకుమార్, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ సుధాంశు మోహన్ సమ ల్, కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి
ఓఎంసీ 70వ వ్యవస్థాపక దినోత్సవం
బొడొబిలొ ’డుబునా’ ఇనుప ఖనిజ గని పునఃప్రారంభం

ఒడిశాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం

ఒడిశాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం