
రైలు ఢీకొని యువతి మృతి
రాయగడ: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువతి మృతి చెందింది. మృతురాలు సదరు సమితి పరిధిలొని కొత్తపేటకు చెందిన సబియా మాఝి (18)గా గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సబియ కొత్తపేటకు సమీపంలోని వీరనారాయణపూర్‌కు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మధ్యలో ఉన్న ట్రాక్‌ను దాటుతుంది. అదే సమయంలో రైలు రావడాన్ని చూసి పట్టాలు దాటేందుకు పరుగెత్తగా కాలి చెప్పు ఒకటి ఉండిపోయింది. దానిని తీసుకెళ్లేందుకు వెళ్లగా అదే సమయంలో రైలు ఆమెను ఢొకొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
రబీ ధాన్యం కొనుగోలు
చేయలేదని రైతుల ఆందోళన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఈ ఏడాది రబీ పంటల సాగుకు కాలువల ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రెండో పంట కలిసి వస్తోంది ఆశపడ్డా రు. ధాన్యం పంట బాగా కలిసి వచ్చింది. అయితే నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో మార్కెట్లో ధర పలకడం లేదని కోరుకొండ సమితి రైతులు తమ అవేదన వ్యక్తం చేశారు. మల్కన్‌గిరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ధాన్యం ధర క్వింటా రూ. 3,100 ఉన్నప్పటికీ వీటిని కొనుగోలు చేయడం లేదు. ప్రధానం మల్కన్‌గిరి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో పొలాల్లో నే ధాన్యం మూలుగుతున్నాయి. వీటికి రైతు కుటంబసభ్యులంతా పొలాల్లోనే కాపలాగా ఉంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబా టు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకో వాలని రైతుల కోరుతున్నారు.
పాత నేరస్థులపై నిఘా
టెక్కలి: టెక్కలి పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా వేయాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం టెక్క లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో దత్తత కానిస్టేబుల్, మహిళా పోలీసుల సమన్వయంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.
కానిస్టేబుల్‌కు వడదెబ్బ
కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యుగంధర్ శుక్రవారం బందోబస్తు విధుల్లో ఉండగా ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యారు. వెంటనే తోటి సిబ్బంది స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించా రు. విషయం తెలుసుకున్న ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
బాణసంచా దుకాణంలో చోరీ
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఇబ్రహింబాద్ పంచాయతీ పరిధిలో కింతలి రోడ్డులో ఉన్న ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌లో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఓ వ్యక్తి క్యాష్ కౌంటర్‌లో ప్రవేశించి తాళాలు పగల కొట్టి లాకర్‌లోని నగదు చోరీ చేశాడు. రూ.10 వేలు వరకు నగ దు ఉంటుందని యజమానులు చెబుతున్నా రు. శుక్రవారం ఉదయం షాపు వద్దకు వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించడంతో యజమా ని వావిలపల్లి శ్యామలరావు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రైలు ఢీకొని యువతి మృతి

రైలు ఢీకొని యువతి మృతి

రైలు ఢీకొని యువతి మృతి