తనయుడికి తలకొరివి పెట్టిన తల్లి
సంతబొమ్మాళి: కన్న కొడుక్కి తల్లి తలకొరివి పెట్టిన ఘటన సంతబొమ్మాళి మండలం సుగ్గువానిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆకాశలక్కవ రం పంచాయతీ సుగ్గువానిపేట గ్రామానికి చెందిన పైల శాంతారావు (22) అనే యువకుడు 15 రోజు ల క్రితం వరికోత మిషన్‌తో కలిసి లారీలో వలస కూలీగా రాజమండ్రి వెళ్లారు. వరి కోతలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద డ్రైవర్ నిద్ర వస్తుందని వాహనం ఆపి నిద్రపోయారు. శాంతారావు డ్రైవర్‌కు చెప్పకుండానే లారీ కింద నిద్రపోయాడు. ఇతనిని గమనించని డ్రైవర్ గురువారం వేకుజామున లారీ తీయడంతో శాంతారావు పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చారు. తండ్రి లేకపోవడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తలకొరివి పెట్టారు. రోడ్డు ప్రమాదంపై నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమాదైనట్లు పోలీసులు తెలిపారు.


