
వీర జవాన్లకు ఘన నివాళి
పర్లాకిమిడి: ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ప్రాణా లు కోల్పోయిన వీర సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పర్లాకిమిడి కాంగ్రెస్ కార్యాల యం ఎదుట శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను మట్టికరిపించిన అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వర్ చంద్ర మఝి, సంజయ్ అధికారి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాస్మిన్ షేక్ సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సూర్యనారాయ ణ పాత్రో, అశోక్ అధికారి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

వీర జవాన్లకు ఘన నివాళి