
● ముగిసిన ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీ పరిధి హరిదాస్‌పూర్‌లో ఉత్సవాలు ముగిశాయి. వారం రోజులుగా గ్రామ ప్రజలు సాంప్రదాయబద్ధంగా చేపడుతున్న బలిజాత్ర పూజలను బుధవారంతో ముగించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలంతా థింసా నృత్యం చేశారు. పంటలు పుష్కలంగా పండాలని, ఎటువంటి దుష్టశక్తులు తమ గ్రామంలోకి ప్రవేశించకూడదని ఇష్టదైవాన్ని పూజిస్తారు. పండగ ప్రారంభం రోజున ఒక దగ్గర తాము పండించిన ధాన్యాన్ని కొంచెం వేస్తారు. వారం రోజుల్లో అవి మొలకెత్తుతాయి. వీటిని వారు దైవంగా భావించి పూజిస్తారు. అనంతరం వాటిని సమీపంలోని నదిలో నిమజ్జనం చేస్తారు.

● ముగిసిన ఉత్సవాలు