
సీబీఎస్‌ఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
పర్లాకిమిడి: పర్లాకిమిడి సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులు సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. మొత్తం 155 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా శతశాతం ఉత్తీర్ణత సాధించారు. స్కూల్ టాపర్‌గా 98 శాతం మార్కులు సాధించి పార్థసారధి సాహు నిలవగా, 97.8 శాతం మార్కులతో తత్సత్ పాణిగ్రాహి రెండోస్థానంలో నిలిచాడు. 90 శాతం మార్కులు ఎనిమిది మంది విద్యార్థులు సాధించారు. అలాగే ప్లస్ టూ ఫలితాల్లో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ టాపర్‌గా కుమారి తనూజా సమంత్ 92 శాతం మార్కులు సాధించింది, అలాగే 91.67 శాతం మార్కులతో రెండోస్థానంలో శుభలగ్న పాఢి నిలిచింది. మొత్తం 135 విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 90 మంది ఫస్ట్‌క్లాస్‌లో పాసైనట్లు ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి తెలియజేశారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు

సీబీఎస్‌ఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు

సీబీఎస్‌ఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు