
పేదరిక నిర్మూలనే లక్ష్యం
శ్రీకాకుళం రూరల్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినక ర్ పుండ్కర్ అన్నారు. సంసిద్ ఆదర్శ్ గ్రామ యోజ నలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండల పరిధి లోని నైరా గ్రామంలో గురువారం పర్యటించారు. స్థానిక సచివాలయంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్థక శాఖలపై సమీక్షించారు. స్థానిక రైతు లు పండిస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధిపై ఆరా తీశారు. పాడిపంటలు, వ్యవసాయ ఉత్పత్తులు మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు తయారు చేయాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీడీఓ బి.శైలజ, నైరా సర్పంచ్ అరవల రామ్‌ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఏఈపై కలెక్టర్ ఆగ్రహం..
ఎలక్ట్రికల్ ఏఈపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో సూర్యఘర్ పథకానికి ఎన్ని కనెక్షన్‌లు ఏర్పాటు చేశారని, విద్యుత్ కెపాసిటీ, ప్రతిపాదనలు ఏమేరకు నిర్వహించారని ప్రశ్నించగా ఏఈ సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఏఈని సస్పెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
లాభసాటి ఉత్పత్తులపై దృష్టి సారించండి
నైరా గ్రామ సందర్శనలో కలెక్టర్