
చంపాఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం
● బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి ● ఇద్దరికి గాయాలు
పర్లాకిమిడి: జిల్లాలోని ఆర్.ఉదయగిరి బ్లాక్ చంపాఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ప్రైవేటు బస్సు (విక్రాంత్), ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ పరస్పరం ఢీకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బరంపురం నుంచి గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి నుంచి కెరడం గ్రామానికి వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్డింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సంజయ్ బోడోరయి ప్రాణాలో కోల్పోగా జోష్టో బోడోరయితో, రింకురయితోకు తీవ్రగాయాలయ్యాయి. వీరు వివాహా కార్డులు పంపిణీ చేయడానికి ఆర్.ఉదయగిరి నుంచి శనివారం బయలుదేరారు. క్షతగాత్రులను ఖోజురిపద ప్రాథమిక వైద్య కేంద్రంలో చేర్చారు. సంజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్.ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.