ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు.. | Heavy Rain In Mumbai And Karnataka | Sakshi
Sakshi News home page

ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు..

May 21 2025 7:52 AM | Updated on May 21 2025 10:00 AM

Heavy Rain In Mumbai And Karnataka

ముంబై/బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, బెంగళూరులో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బెంగళూరులో దాదాపు 36 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సాధారణ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

heavy rainfall in Bengaluru photos6

ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఈదారుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రత్నగిరి జిల్లాలోని వెర్వాలి, విలావాడే రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. 

అలాగే కోస్తా కొంకణ్-గోవా మార్గంలో భారీ బండరాయి పడడంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలను కలిపే 741 కిలోమీటర్ల మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. జల్వాయు కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy Rainfall in Vijayawada 9

మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు నగరంలోని మాన్యత టెక్‌ పార్క్, సిల్క్‌ బోర్డ్‌ జంక్షన్‌లలో వంటి ప్రాంతాల్లో మోకాలి లోతు వరద నిలిచిపోయింది. వాహనాలు మొరాయించడంతో వాహన దారుల అవస్థలు వర్ణనాతీతం. వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో మరణాల సంఖ్య అయిదుకు చేరింది. సాయి లేఔట్‌లోకి భారీగా వరద చేరడంతో చిన్నపాటి దీవిని తలపిస్తోంది. నివాసాల్లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి నీరు చేరడంతో అందులోని వారు బయటకు రాలేక, లోపల ఉండలేక అవస్థలు పడుతున్నారు. ఆ లేఔట్‌లోని కనీసం 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరికి అధికార యంత్రాంగం ఆహారం, నీరు సరఫరా చేసింది. వరదతో నిండిన హెన్నూర్‌ అనాథాశ్రమంలోని వారిని కూడా కాపాడారు. ఇలా ఉండగా, కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బెంగళూరుకు ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది.  

Unseasonal Rains in Telugu States Photos18 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement