
టెక్ నగరం బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అనేక నివాస ప్రాంతాలలోకి నీళ్లు చేరాయి. రోడ్లు, భవనాలు తీవరంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రోజువారీ జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాధిత ప్రజలను పలకరిచేందుకు, వారికి భరోసా కల్పించేందు స్థానిక ఎమ్మెల్యే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ జరిగిందంటే..
బెంగళూరులో గత 48 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు నీరు నిలిచి పోయింది. నివాస ప్రాంతాలలోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీటమునిగాయి. అధికారులు బాధిత నివాసితులను సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అయితే బాధతులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే బి బసవరాజ్ బుల్డోజర్‌లో ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. సోమవారం సాయి లేఅవుట్‌లోని ప్రభావిత ప్రాంతాన్ని జెసీబీలో వెళ్లి మరీ వారిని పలకరించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. నివాసితుల ఇళ్లలోకి నీరు ప్రవేశించిన ప్రదేశా,నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు జెసిబిలను ఉపయోగిస్తున్నారు
#Bengaluru continued to #experience #heavyrains, leading to #water entering homes in several parts and #flooding in #low-#lying #areas of the #city. As of 8 a.m., the #city received 105 mm of #rainfall in the past 24 hours, according to the (IMD). pic.twitter.com/iKYkdqk9xM
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) May 19, 2025
మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజీ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక చెట్ల కొమ్మలు పడిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పెట్టింది పేరు బెంగళూరు పరిస్థితి మరోసారి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రభావిత జిల్లాల్లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపుర, తుమకూరు, మండ్య, మైసూరు, హసన్, కొడగు, బెళగావి, బీదర్, రాయచూర్, యాద్గిర్, దావణగెరె మరియు చిత్రదుర్గ ఉన్నాయి. సాయి లేఅవుట్ ,హోరామావు ప్రాంతం అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్
కర్ణాటక తీరప్రాంతంలో భారీ వర్షాలు అంటూ భారత వాతావరణ శాఖ (IMD) 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది, ఉత్తర , దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో అతి భారీ వర్షాలకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులో, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, గడగ్, హవేరి, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.