
ధనుష్, కృతి సనన్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘తేరే ఇష్క్ మే’ షూటింగ్ పూర్తి

ఈ సందర్భంగా ముంబైలో జరిగిన పార్టీలో ధనుష్‌తో పాటు కృతి సనన్, మృణాల్ ఠాకూర్, తమన్నా భాటియా, భూమి పెడ్నేకర్ సందడిగా కనిపించారు.

ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ధనుష్‌ని హిందీకి పరిచయం చేసిన చిత్రం రాంజనా, ఆ తర్వాత అత్రంగీ రే మూవీ చేశాడు. ఇప్పుడు మూడోసారి ఆనంద్ కలయికలో ‘తేరే ఇష్క్ మే’ మూవీ రానుంది.

ఈ ఏడాది నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.











