
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్‌డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్‌లో సందడి చేశారు. అనంత్ కాల్‌లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్‌ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్‌లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్‌కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది.
ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే.