బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్‌ వీడియోలు | Heavy Rain Fall In Bengaluru Flood Videos Viral | Sakshi
Sakshi News home page

బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్‌ వీడియోలు

May 19 2025 11:38 AM | Updated on May 19 2025 1:05 PM

Heavy Rain Fall In Bengaluru Flood Videos Viral

బెంగళూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు  పలు రాష్ట్రాల్లో భారీ నుంచి  అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు.. రెండు రోజులుగా కర్నాటకలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం బెంగళూరు నగరంలో ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్ష పాతం  నమోదైంది. దీంతో, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు వరద నీటిలోనే ఎమ్మెల్యే జేసీబీపై వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం (rain) కురవడంతో వరదలు వచ్చాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డులో ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, మైసూరు, హాసన్, తుమకూరు మరియు ఇతర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. యలహంక, కేఆర్‌పురం, ఇతర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బస్వరావు సహాయక చర్యలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి జేసీబీపై వెళ్లారు. స్థానికులను పరామర్శించి.. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

 

22 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.. 

బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది.  మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు  ప్రయాణించవద్దని సూచించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement