
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రేమించుకున్న ఆ జంట ఏ కారణం చేతనో ఒక్కటి కాలేకపోయింది. వేర్వేరు వ్యక్తులతో వారికి వివాహాలు అయ్యాయి. అయినా వారి మధ్య ప్రేమ కొనసాగి చివరకు ఇద్దరినీ బలి తీసుకుంది. ప్రియురాలిని కత్తితో హత్య చేసిన ప్రియుడు అదే కత్తితో తానూ పొడచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ సుతార్(35), రేష్మ(29)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే రేష్మకు మరో వ్యక్తితో వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆనంద్‌కు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ విషయం రేష్మ భర్తకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆనంద్‌ను పిలిపించి హెచ్చరించి వదిలేశారు. ఆగ్రహంతో ఉన్న ఆనంద్ రేష్మను నిర్జనప్రదేశానికి పిలిపించుకుని కత్తితో పొడిచి హత్య చేశాడు.అదే కత్తితో తానూ పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నందగడ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.