
విశాఖపట్నం జిల్లా: మండలంలోని చూచుకొండ గ్రామానికి చెందిన వివాహిత సుశీల (35)శుక్రవారం ఆత్యహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. చూచుకొండ గ్రామానికి చెందిన ఆడారి సూరి నాగేశ్వరరావు,సుశీల దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుశీల మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తున్నారు.
కాగా తన కుమారుడితో కలిసి సుశీల పొలం పనులకు వెళ్లింది. పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం కొంతసేపటి తరువాత కుమారుడు ఇంటికి వెళ్లేసరికి సుశీల ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉంది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించిన కుమారుడు, మునగపాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆస్పత్రి తరలించారు.
చదవండి: అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!