
బెంగళూరులో ఆదివారం (మే 18) ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం (మే 19) ఉదయం 8:30 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 105.5 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రయాణం ఇబ్బందిగా మారింది, ఆఫీసులకు వెళ్లలేక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని అన్ని కంపెనీలు రెండు రోజులు వర్క్ ఫ్రమ్ సదుపాయం అందించాలని బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేశారు.
భారీ వర్షాల కారణంగా.. కాగ్నిజెంట్ కంపెనీ ఈరోజు (మే 20) తన ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ.. బెంగళూరులో 40,000 మంది ఉద్యోగులను నియమించింది.
ఇన్ఫోసిస్ ఇప్పటికే మూడు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అనుసరిస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా, సిల్క్ బోర్డ్.. రూపేన అగ్రహార మధ్య హోసూర్ రోడ్డును బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు.
All companies in Bengaluru, including Infosys, must declare two days of work from home due to rains.
— P C Mohan (@PCMohanMP) May 19, 2025