Cyclone Biparjoy: Storm To Intensify In a Few Hours, IMD Says - Sakshi
Sakshi News home page

ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను

Jun 10 2023 6:55 PM | Updated on Jun 13 2023 6:38 PM

Cyclone Biparjoy: Storm To Intensify In Few Hours IMD - Sakshi

బిపర్ జోయ్ తీవ్ర తుపానుగా మారబోతోందా..? కేంద్ర వాతావరణ శాఖ ఏమని హెచ్చరిస్తోంది..? దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది..? అసలు బిపర్ జోయ్ అంటే ఏంటి..? 

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందంటూ ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

మరోవైపు తుపాను నేపథ్యంలో గుజరాత్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వల్సాద్ లోని తిథాల్ బీచ్ ను ఈ నెల 14 వరకు మూసి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని... సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని తెలిపారు. మరోవైపు, వార్నింగ్ సిగ్నల్ ఇవ్వాలని పశ్చిమ తీరంలోని అన్ని పోర్టులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బిపర్ జోయ్ అని బంగ్లాదేశ్ సూచించిన పేరు
అదలా ఉంటే.. ప్రతి తుపానుకు ఒక పేరు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది.. ఈ క్రమంలోనే.. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు బిపర్ జోయ్ అనే పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరు. బిపర్ జాయ్ అంటే విపత్తు అని దీని అర్థం. మరి ఈ విపత్తు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement