
అగ్ని గంగమ్మ పండగ ప్రారంభం
● ఆహా.. ఏం హాయి
వేసవి తాపంతో జనజీవనం అల్లాడిపోతోంది. మూగజీవాలు కూడా ఎండకు తాళలేకపోతున్నాయి. హిరాకుడ్ వన్య ప్రాణుల మండలం సంబల్‌పూర్ జంతు ప్రదర్శన శాలలో ఈ దృశ్యం తారసపడింది. చల్లని ఐసు దిమ్మను అక్కున చేర్చుకుని ఈ భల్లూకం వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతోంది. చూపరులను ఈ దృశ్యం ఆకట్టుకుంది. – భువనేశ్వర్
రాయగడ: స్థానిక పిట్టలవీధిలోని అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక పండగ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. సాయంత్రం అమ్మవారి పాదా లు తీసుకువచ్చే కార్యక్రమంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక కేఎన్‌కే సమీపంలోని అమ్మవారి పాదాల గుడి నుంచి సాంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం మందిరంలో పాదాలను ఉంచ డంతో పండగకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజుల పాటుగా జరగనున్న ఈ పండగలో భాగంగా ఆఖరి రోజున మల్లెలు (అగ్గిపై నడవడం) తొక్కే కార్యక్రమం ప్రధాన ఘట్టం. దీనిని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పండగలో అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. హిందూ, ముస్లింలు కలసి ఈ పండగను ప్రతీ ఏడాది జరుపుతుండడం విశేషం.

అగ్ని గంగమ్మ పండగ ప్రారంభం

అగ్ని గంగమ్మ పండగ ప్రారంభం