
మూడంతస్తుల భవనం మీద నుంచి పడిన కార్మికులు
జయపురం: స్థానిక జిల్లా కోర్టు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం పైనుంచి జారిపడి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముశీదాబాద్ యూశిఫ్ షేక్(20), రాయిబుల్ షేక్(28), మహ్మద్ ఆసన్(26), ఆలమిన్ షేక్(26) స్లాబ్ వేసేందుకు పనిచేస్తుండగా అకస్మాత్తుగా వెదురు విరిగి కిందకు పడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రికి చేర్చారు. వారు ఒక కాంట్రాక్టు కంపెనీ తరఫున పనిచేస్తున్నారు. అయితే వారికి రక్షణ పరికరాలు సమకూర్చకపోవటం వల్ల ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
నవరంగపూర్ సరిహద్దులో పులికూన సంచారం
జయపురం: నవరంగపూర్ జిల్లా–చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక చిరుతపులి పిల్ల సంచరిస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ఏసీఆర్ పోలీసు రెండో శిక్షణ కేంద్రం సిటిజేడబ్ల్యూ కాలేజ్ ప్రాంతంలో చిరుత పులి పిల్ల సంచరిస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందు వల్ల ప్రజలు భయపడుతున్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా తారాప్రసాద్
జయపురం: జయపురం ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత తారాప్రసాద్ బాహిణీపతిని జాతీయ కాంగ్రెస్ కమిటీ ఒడిశా ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా నియమించింది. జయపురం కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. బాహిణీపతికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
కూలిన కాల్వర్టు
కొరాపుట్: కొరాపుట్–రాయగడ మధ్య కల్వర్టు కుప్ప కూలింది. ఆదివారం ఈ మార్గంలో డుమ్రిపొదర్–తోయాపుట్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఒక్కసారిగా కిందకు జారింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రమాద సంకేతంగా రాళ్లు పెట్టారు. నిత్యం భారీ వాహనాలు తిరిగే మార్గం కావడంతో వాహనదారులు అప్రమత్తంగా కల్వర్టు దాటుతున్నారు.
సూపర్ స్పెషలిస్ట్ క్లినిక్ ప్రారంభం
జయపురం: కొరాపుట్‌లోగల సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రిలో శనివారం సూపర్‌స్పెషలిస్ట్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వి.కీర్తి వాసన్ ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. వైద్య కళాశాల డీన్, హాస్పిటల్ అధికారి డాక్టర్ ఫ్రొఫెసర్ సుకాంత కుమార్ సాహు, హాస్పిటల్ రిజిస్ట్రార్ రంజన్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. కార్డియాలజి, న్యూరోలజి, నెఫ్రాలజి విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు, సూపర్‌స్పెషలిస్టు క్లినిక్‌ను సందర్శించారు.

మూడంతస్తుల భవనం మీద నుంచి పడిన కార్మికులు

మూడంతస్తుల భవనం మీద నుంచి పడిన కార్మికులు

మూడంతస్తుల భవనం మీద నుంచి పడిన కార్మికులు

మూడంతస్తుల భవనం మీద నుంచి పడిన కార్మికులు